మహేష్ తో సినిమా నచ్చకపోయినా తీసా.. మురళీమోహన్ హాట్ కామెంట్స్..!
మురళీమోహన్ ఇలా మాట్లాడుతూ అతడు కథన త్రివిక్రమ్ దాదాపుగా మూడు గంటల పాటు తమకు చెప్పారని.. కథ అయితే చాలా బాగుంది కానీ ఆఖరిలో తనకు ఒక అనుమానం వచ్చిందని సినిమా మొదట్లో హీరో నెగటివ్ క్యారెక్టర్ ఉంటుంది అది తనకు నచ్చలేదని వెల్లడించారు.. ఆ సమయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ తో పాటుగా తన తమ్ముడు కిషోర్ ఒకే మాట చెప్పారని.. మీరు ఇంటర్నేషనల్ సినిమాలు చూడండి ఒకవేళ హీరో సర్వగుణ సంపన్నుడిగా ఉండాలి అనుకుంటే ఈ రోజుల్లో అసలు కుదరదు అంటూ తెలిపారు. హీరోలలో కాస్త నెగెటివిటీ కూడా ఉండాలి అని చెప్పారని తెలిపారు.
అలాంటి నెగెటివిటీని పాజిటివ్గా ఎలా చేరుకున్నారని విషయమే ఇప్పుడు ట్రెండ్ గా ఉందని అతడు సినిమా చేస్తున్న సమయంలో తన తమ్ముడితో పాటు త్రివిక్రమ్ కూడా చెప్పారని తెలిపారు మురళీమోహన్. దీంతో తాను చేసేదేమీ లేక సరేలే అని ఒప్పుకున్నానని.. అయితే సినిమా మొదలు పెట్టిన తర్వాత కథ తనకు నచ్చలేదని కానీ సినిమా పైన అసంతృప్తితో ఉన్నామనే విషయం పైన కానీ ఎక్కడ జరగలేదని మురళీమోహన్ వెల్లడించారు. అతడు తర్వాత తన బ్యానర్ నుంచి మరొక సినిమా ఏది రాలేదని అడగగా.. తాను రాజకీయాలలో ఉండడం వల్ల రాలేదని అలాగే తన కుటుంబ సభ్యులు కూడా వ్యాపారంలో ఉండడం వల్లే సినీ ఇండస్ట్రీలో మళ్లీ సినిమాలను చేయలేదని తెలిపారు. అందుకే చాలా గ్యాప్ తీసుకున్నామని ఇప్పటికీ 12 ఏళ్లు దాటిపోయింది.. సినిమాలు తీయకపోయినా పరవాలేదు.. తన బ్యానర్ మీద మంచి సినిమాలు తీయాలనీ తెలిపా.. వచ్చే ఏడాది చిన్న సినిమా తీస్తున్నామని కూడా వెల్లడించారు.