హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024 : ఇండస్ట్రీ మారినా 'బేబమ్మ' ఫేట్ మారలేదుగా..!!

murali krishna
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ “ కృతి శెట్టి “ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన “ ఉప్పెన” సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అయింది.. ఆ సినిమాలో “బేబమ్మా” పాత్రలో కృతి అద్భుతంగా నటించింది.. ఉప్పెన సినిమా ఊహించినట్లుగానే బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. ఈ సినిమా ప్రత్యేకత ఏంటి అంటే హీరో, హీరోయిన్, దర్శకుడికి ఇది మొదటి సినిమా.. ఫస్ట్ మూవీతోనే వారు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు..అయితే కృతి శెట్టికి ఉప్పెన క్రేజ్ కారణంగా భారీగా ఆఫర్స్ వచ్చాయి.. ఈ భామ ఎన్ని సినిమాలు చేసిన టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం “బేబమ్మ” గానే పిలుచుకుంటూ వుంటారు.. టాలీవుడ్ లో కృతి శెట్టికి వున్న ఏకైక బ్లాక్ బస్టర్ ఉప్పెన మాత్రమే ఆ తరువాత ఆమెకు ఆ అవకాశం రాలేదు..ఎన్ని సినిమాలలో నటించినా కానీ ఉప్పెన రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాయి.. దీనితో కృతి శెట్టికి తెలుగులో అవకాశాలు తగ్గాయి.. దీనితో ఈ భామ తమిళ్, మలయాళ సినిమాలపై ఫోకస్ పెట్టింది..

 తమిళ్ లో వరుస సినిమాలలో నటించింది కానీ అదృష్టం మాత్రం ఈ అమ్మడికి దూరంగానే ఉంటుంది..ఇటీవల మలయాళ యంగ్‌ స్టార్‌ నటుడు టోవినో థామస్‌ కి జోడీగా 'ఏఆర్‌ఎం' సినిమాలో నటించింది.రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఏఆర్‌ఎం' చిత్రం కేరళ లో డీసెంట్ ఓపెనింగ్స్ దక్కించుకుని లాంగ్ రన్‌ లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగు లో కృతి శెట్టికి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో 'ఏఆర్‌ఎం' ను డబ్బింగ్‌ చేసి భారీ ఎత్తున విడుదల చేసారు.. కానీ ఈ సినిమా తెలుగు లో నిరాశ పరిచింది..ఇదిలా ఉంటే ఈ ఏడాది టాలీవుడ్‌లో శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన ‘మ‌న‌మే’ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా చేసింది. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మూవీ కూడా మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది.. ఇక టాలీవుడ్ లో ఆఫర్స్ రావాలంటే గ్లామర్ ఒక్కటే మార్గమని తెలుసుకున్న ఈ భామ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో దాడి చేయడం మొదలు పెట్టింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: