గ్యాప్ లేకుండా నటసింహం విలయతాండవం.. బాక్స్ ఆఫీస్ కు దబిడి దిబిడే..!

Amruth kumar
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రెసెంట్ వెరీ బిజీగా మారిపోయారు. సినిమాలు , రాజకీయాలు అన్ స్టాపబుల్‌ అంటూ ఎంతో బిజీగా కనిపిస్తున్నారు .. రీసెంట్ గానే డాకు మహారాజ్ షూటింగ్ కంప్లీట్ చేశారు .. ఆ వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ తాండవం సినిమాను మొదలు పెట్టారు. రీసెంట్గా ఈ సినిమా తొలి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. ఆర్ ఎఫ్ సీలో కీలక యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక అందులో బాలయ్య పై కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించారట.

నటసింహం ఇప్పుడైనా గ్యాప్ తీసుకుంటుందా ? నా ఆకలి ఎప్పటికీ తీరనిది అంటూ రెండో షెడ్యూల్ కూడా ఇప్పటికే మొదలుపెట్టేసారు .. హైదరాబాద్లోనే ఈ షెడ్యూల్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్లో బాలకృష్ణతో పాటు ఈ సినిమాలో నటించే ప్రధాన తారగణమంతా జాయిన్ అవుతారట. అయితే ఈ షూటింగ్ హైదరాబాదులో ఎక్కడ జరుగుతుంది .. అందులో పాల్గొంటున్న నటులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఆధ్యాత్మిక అంశాలతో ముడుపెట్టి భారీ యాక్షన్ థ్రిల్ల‌ర్ గా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న సినిమా ఇది .. ఇక ఇందులో బాలకృష్ణ రెండు విభిన్న‌ పాత్రలో కనిపిస్తారు. ఈసారి ఆ పాత్రలతో బాలకృష్ణ పాన్ ఇండియా ని షేక్‌ చేయడం ఖాయమంటున్నారు. అఖండ సినిమాను మించి తాండవం ఉంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు కూడా బాలయ్యకు కొత్త ఇమేజ్ తీసుకురాటం ఖాయమని అంటున్నారు.

అలాగే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం కూడా బాలయ్య అలాగే కష్టపడుతున్నారు. 64 సంవత్సరాల వయసులోను బాలయ్య డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ లో ఏమాత్రం తగ్గేదేలే అంటూ నటిస్తున్నారు.  ఇక సంక్రాంతి వస్తున్నడాకు మహారాజ్ లోను బాలయ్య రియల్ స్టంట్స్‌ చేసినట్లు దర్శకుడు బాబి రీసెంట్ గానే చెప్పాడు. అలాంటిది బాలయ్య అఖండ తాండవం కోసం ఇంకా ఏ రేంజ్ లో కష్టపడుతున్నారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సంక్రాంతి కోసం డాకు మహారాజ్ రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ పనుల్లో కూడా పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో ఆఖండ 2 షూటింగ్ కి కొంత బ్రేక్ ఇస్తారు .. అప్పటివరకు నాన్ స్టాప్ హంటింగ్ అంటున్నాడు నట‌సింహం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: