టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా ... కియార అద్వానీ ఈ సినిమాలో చరణ్ కు జోడిగా నటించింది. అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ చాలా రోజుల క్రితమే విడుదల చేశారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు అదిరిపోయే రేంజ్ లో ప్రచారాలను నిర్వహిస్తున్నారు. తాజాగా చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ సినిమాలోని ఓ పోస్టర్ తో భారీ కటౌట్ తయారు చేశారు. ఈ కటౌట్ లాంచింగ్ కు ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు విచ్చేశాడు. ఇక ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను ప్రకటించాడు.
ఈ మూవీ బృందం వారు ఈ సినిమా టీజర్ను కొన్ని రోజుల క్రితం విడుదల చేయగా అందులో చరణ్ రాజకీయ నాయకుడిగా , ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో మాత్రమే కనిపించాడు. తాజా ఈవెంట్లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... ఈ సినిమాలో చరణ్ రాజకీయ నాయకుడిగా , ఐఏఎస్ ఆఫీసర్ గా మాత్రమే కాకుండా పోలీస్ ఆఫీసర్ గా కూడా కనిపించబోతున్నట్లు తెలియజేశాడు. దానితో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో మరింతగా పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.