2024 వ సంవత్సరం చివరి దశకు చేరుకుంది . మరికొన్ని రోజుల్లోనే ఈ సంవత్సరం ముగియబోతుంది . ఇక ఈ సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి . అందులో కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాల ను అందుకు ని మంచి విజయాలను అందుకోగా మరికొన్ని సినిమాలు బా రి అంచనాల నడమ విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి . ఇక కొన్ని సినిమాలు పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మిరాకిల్స్ సృష్టించాయి.
ఇది ఇలా ఉంటే కొన్ని సినిమాలు మూవీ బృందం వారు ఈ సంవత్సరం విడుదల చేస్తాము అని కచ్చితంగా ప్రకటించిన ఆ తర్వాత పోస్ట్ పోన్ అయ్యి నెక్స్ట్ ఈయర్ కు వెళ్లిన సినిమాలో కూడా ఉన్నాయి. అలాంటి సినిమాలలో రాబిన్ హుడ్ మూవీ ఒకటి. నితిన్ హీరో గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ లీలా హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... వెంకీ కుడుముల ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం అనగా 2024 డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
దానితో ఈ సినిమా ఈ సంవత్సరం వస్తుంది అని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేయడం లేదు అని వచ్చే సంవత్సరం విడుదల చేయబోతున్నట్లు మరికొన్ని రోజుల్లోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. అలా ఈ సంవత్సరం విడుదల కావలసిన ఈ క్రేజీ మూవీ వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ అయ్యింది.