టూవరస్ట్.. చిరంజీవిని ఘోరంగా అవమానించిన విలన్.?

Pandrala Sravanthi
 తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు.  ఇందులో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరో చిరంజీవి.  ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దన్నలా మారారు. అలాంటి చిరంజీవి  ఇండస్ట్రీలో కొత్తగా నటిస్తున్న సమయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ చివరికి ఇండస్ట్రీలోనే మెగాస్టార్ గా మారారు. అలా చిరంజీవి చేసినటువంటి చాలా సినిమాల్లో కోట శ్రీనివాసరావు కీలక పాత్రలో నటించారు.  ఒకానొక సమయంలో ఆయన చిరంజీవిని సీనియర్ ఎన్టీఆర్ ని కించపరిచేలా మాట్లాడారు. ఆ వివరాలు ఏంటో చూద్దామా. కోట శ్రీనివాసరావు మండళాధీశుడు అనే చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేస్తున్న పాత్రలో ఆయన చాలా నెగిటివ్ గా నటించారు.  ముఖ్యంగా ఎన్టీఆర్ జీవితంపై సెటైర్లు వేసే విధంగా ఆ పాత్ర ఉంది. 

ఆ టైంలో ఎన్టీఆర్ అభిమానులు కోట శ్రీనివాస రావు పై కోపానికి వచ్చారు.  అంతే కాదు ఒకానొక సమయంలో దాడికి కూడా చేయడానికి ప్రయత్నించారు.  ఇక ఇదే కాకుండా  మెగాస్టార్ చిరంజీవి  కోట శ్రీనివాసరావు కలిసి నటించినటువంటి మరో చిత్రం స్టువర్టుపురం పోలీస్ స్టేషన్..  అయితే ఈ సినిమా అప్పట్లో దారుణంగా ఫ్లాప్ అయింది. అయితే ఈ రిజల్ట్ చూసిన తర్వాత చిత్ర నిర్మాత కేఎస్ రామారావు  ఈ సినిమా గురించి చాలామంది ఒపీనియన్ తీసుకున్నారు.  దీనిలో భాగంగా కోటాని కూడా సినిమా గురించి అడిగాడట.

 దీంతో సినిమాపై కోట శ్రీనివాసరావు స్పందిస్తూ సినిమా స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ కాదు టు వరస్ట్ పురం పోలీస్ స్టేషన్ అంటూ సెటైర్ వేశారట. ఆయన మాట్లాడిన మాటలు చిరంజీవి చెవిలో పడ్డాయట. దీంతో చిరంజీవి ఆయనను ఏమనకుండా చిన్నగా ఒక నవ్వు నవ్వి సైలెంట్ అయిపోయారట. కానీ మెగాస్టార్ అభిమానులు మాత్రం కోట శ్రీనివాసరావు పై దారుణంగా విరుచుకుపడి  నువ్వు అలా మాట్లాడతావా అంటూ దారుణంగా విమర్శించారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన మ్యాటర్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: