"నావల్ల కాదు.. నన్ను వదిలేయ్".. ఆ రాత్రి వెక్కివెక్కి వచ్చిన కీర్తి సురేష్.. ఏమైందంటే..?
మరి ముఖ్యంగా కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వడానికి నిర్ణయించుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఆశలతో చేసిన మూవీ బేబీ జాన్ . ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయింది . అయితే ఈ సినిమాపై మొదటి నుంచి చాలా చాలా అసలు ఉన్నాయి . కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . బొక్క బోర్లా పడిపోయింది . వరుణ్ ధావన్ నటనకు మంచి మార్కులు పడిన కీర్తి సురేష్ నటనకు మాత్రం అస్సలు బాలీవుడ్ దుమ్మెత్తి పోస్తుంది.
అసలు ఆమె నటా..? ఆవిడని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు ..? అన్న రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరైతే ఏకంగా కీర్తి సురేష్ పేరుని మర్చిపోయిన విధంగా మాట్లాడుతున్నారు. అయితే కీర్తి సురేష్ మాత్రం బేబీ జాన్ పై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉందట. ఈ సినిమాతో బాలీవుడ్ లో పాగ వేయడం పక్కా అని డిసైడ్ అయిపోయిందట . అలాంటి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోగానే జనాల ట్రోలింగ్ చూసి కీర్తి సురేష్ సినిమా రిలీజ్ అయిన నైట్ వెక్కి వెక్కి ఏడ్చిందట . "క్రిస్మస్ సెలబ్రేషన్స్ పాల్గొందాం రా..? అంటూ హస్బెండ్ పిలిచినా కూడా.. నా వల్ల కాదు ప్లీజ్ నన్ను వదిలేయ్" అంటూ చాలా మూడీగా డిసప్పాయింట్ అయిపోయిందట. మ్యారేజ్ తర్వాత ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను ఎంజాయ్ చేయలేకపోయిందట . రీసెంట్ గానే ఆంటోనీ - కీర్తి సురేష్ ల పెళ్లి జరిగింది . పెళ్లి తర్వాత ఫస్ట్ క్రిస్మస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోయింది కీర్తి అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు..!