అందం.. నటన ఉందా నో యూస్.. హాట్ బ్యూటీకి కరువైన అవకాశాలు..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో వరుస పెట్టి అవకాశాలు రావాలి అంటే హీరోయిన్లకు ప్రధానంగా ఉండాల్సింది విజయాలు. హీరోయిన్స్ నటించిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ఉంటే వారికి వరుస పెట్టి క్రేజీ సినిమాలలో అవకాశాలు వస్తూ ఉంటాయి. అదే వారు నటించిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడితే వారికి సినిమా అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటాయి. దానితో అందం , అభినయం , నటన అన్ని ఉన్నా కూడా విజయాలు లేనట్లయితే కొంత మంది నటీమణులకు అవకాశాలు పెద్దగా దక్కవు. ఆ లిస్టులోకి వచ్చే బ్యూటీలలో డింపుల్ హయాతి ఒకరు.

ఈ ముద్దుగుమ్మ గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈమె రవితేజ హీరో గా రూపొందిన కిలాడి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ సినిమాలో డింపుల్ హయాతి మాత్రం తన అదిరిపోయే రేంజ్ అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. దానితో ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమా పరిశ్రమలు అవకాశాలు వస్తాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక ఈమె తమిళ నటుడు సామాన్యుడు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక దానితో ఈమెకు సినిమా అవకాశాలు చాలా వరకు తగ్గాయి.

కొంత కాలం క్రితం ఈ నటి గోపీచంద్ హీరోగా రూపొందిన రామబాణం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా ఈ నటికి విజయాన్ని అందించలేకపోయింది. ఇలా అందం , అభినయం , నటన అన్ని ఉన్నా కూడా సరైన విజయాలు లేకపోవడంతో ఈమెకు మంచి సినిమా అవకాశాలు దక్కడం లేదు. లేదంటే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయి ఉన్న హీరోయిన్గా కెరియర్ను కొనసాగించేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: