సర్జరీ చేయించుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఏమైందంటే..?
ఈ సర్జరీ కోసం ఈమె 30 రోజులపాటు బెడ్ రెస్ట్ కి పరిమితమైనట్లుగా వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన శరీరంలో హార్మోన్ అసమతుల్యత కారణం వల్ల తాను రోజురోజుకీ బరువు పెరిగిపోతున్నారని దీనివల్ల తన ఆరోగ్యం కూడా చాలా దెబ్బతినిందంటూ వెల్లడించింది. అయితే ఈ విషయం తనకు తెలియక చాలా బరువు పెరిగిపోతున్నానని గుర్తించి బరువు తగ్గాలని వర్క్ అవుట్ల పేరుతో శరీరాన్ని చాలా ఇబ్బంది పెట్టిందట.
దీంతో భుజం నొప్పి ,కాళ్ళు నొప్పి, నడుము నొప్పి ఇతర ఇతర సమస్యలు ఈమెను చుట్టుముట్టడంతో వైద్యుల వద్దకు వెళ్లి పరిశీలించగా హార్మోన్ల అసమ్మతుల్యత అని తెలియడంతో మేజర్ సర్జరీ చేయించుకుందట. ఈ ఏడాది ఇమే నుంచి ఏ ఒక్క సినిమా కూడా రాలేదు. చివరిగా గోపీచంద్ తో నటించిన రామబాణం సినిమా 2023 లో విడుదల అయ్యింది. ఇక ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గానే అంటూ గ్లామర్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. సర్జరీ విషయం తెలిసిన అభిమానులు డింపుల్ హయాతి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఈ విషయమైతే వైరల్ గా మారుతున్నది.