ఏంటి అప్సరసలాంటి భార్య శ్రీదేవిని పక్కన పెట్టుకొని బోనీ కపూర్ ఇతర అమ్మాయిలతో కూడా ఎఫైర్స్ పెట్టుకున్నారా.. ఇంతకీ బోనీకపూర్ మాట్లాడిన మాటల్లో ఉన్న అంతరార్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. బోనికపూర్ బాలీవుడ్ స్టార్ నిర్మాతల్లో ఈయన ఒకరు. ఇక ఈయన తన సినిమాల కంటే ఎక్కువగా శ్రీదేవిని పెళ్లి చేసుకోవడం వల్లే ఫేమస్ అయిపోయారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎంతోమంది శ్రీదేవిని దేవతలాగా భావించేవారు. చాలామంది అప్పటి జనరేషన్ అబ్బాయిలు శ్రీదేవి లాంటి అమ్మాయి తమకు భార్యగా రావాలని కోరుకునేవారు.అంత ఫేమస్ అయిన శ్రీదేవిని బోనికపూర్ పెళ్లి చేసుకోవడంతో అందరూ షాక్ అయిపోయారు.బోని కపూర్ కి అప్పటికే పెళ్లయిపోయింది. ఇక చూడ్డానికి కూడా బోని కపూర్ హ్యాండ్సమ్ గా ఉండడు. కాస్త బొద్దుగా ఉంటారు.
అయితే ఇప్పటికి కూడా బోని కపూర్ శ్రీదేవి ఫొటోస్ ను చూస్తే అసలు శ్రీదేవి బోని కపూర్ ని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుందో అని అందరిలో ఒక అనుమానం అయితే ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో బోనికపూర్ మాట్లాడుతూ నేను శ్రీదేవిని పెళ్లి చేసుకునే ముందు ఆరు సంవత్సరాలు వెంటపడ్డాను. మొదట ప్రపోజ్ చేస్తే నీకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు ఇదేం పాడుపని అంటూ నన్ను తిట్టి ఆరు నెలలు దూరం పెట్టింది. కానీ ఆ తర్వాత నా ప్రేమ, నా పరిస్థితి మొత్తం అర్థమయ్యేలా చెప్పాను. దాంతో ఆమె నా ప్రేమ అని ఒప్పుకొని పెళ్లి చేసుకుంది.
అయితే నేను శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాక కూడా నా చుట్టుపక్కల ఉండే చాలామంది అమ్మాయిల మోజులో పడ్డాను. కానీ నా మనసులో ఎప్పటికీ శ్రీదేవి ప్రత్యేకం.ఆమె చనిపోయిన కూడా ఆమె జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. శ్రీదేవి లేని లోటు ఎవరూ బర్తీ చేయలేరు అంటూ బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. ఇక బోనీకపూర్ మాటలు నెట్టింట వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ అందమైన అప్సరస లాంటి శ్రీదేవి పక్కనే ఉండగా వేరే అమ్మాయిలతో ఎఫైర్ ఏంటో అంటూ కామెంట్లు పెడుతున్నారు