సీఎం రేవంత్‌కు టాలీవుడ్‌ హీరోయిన్‌ వార్నింగ్‌ ?

Veldandi Saikiran
టాలీవుడ్‌ స్టార్‌ నటి మాధవి లత ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తాజాగా మాధవి లత రేవంత్ రెడ్డికి సూటిగా కొన్ని ప్రశ్నలు విసిరారు. సంధ్య థియేటర్ వ్యవహారంలో ఎంత పెద్ద దుమారం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ ఘటనపై అల్లు అర్జున్ ను కొంత మంది సపోర్ట్ చేస్తుంటే మరి కొంత మంది విమర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నది కరెక్ట్ అని కొంతమంది అంటుంటే మరి కొందరు కావాలనే రేవంత్ అల్లు అర్జున్ ను ఇలా టార్గెట్ చేసి ఇరికిస్తున్నాడని అంటున్నారు.

తాజాగా ఇదే అంశం పైన నటి మాధవి లత స్పందించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మాధవి లత తప్పుబడుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మాధవి లత ఓ పోస్ట్ పెట్టారు. అందులో భాగంగా అల్లు అర్జున్ చేసింది క్రైమ్ అసలు కాదు. ఆయనకు తెలియకుండా జరిగింది. దానిమీద సరిగ్గా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు. తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడాలు ఉంటాయి.

మెదక్ జిల్లాలో తాజాగా ఒక చిన్న పాపను రేప్ చేశారట అంటూ గుర్తు చేసింది. దాని గురించి మాట్లాడి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీలని నిలదీస్తారా? కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల వల్లే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా అని లేఖ రాసి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు పాతిక లక్షలు కాకపోయినా ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? పొద్దు తిరుగుడు పువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారా? జరిగిన తప్పుకి ఇండస్ట్రీ మీద ఉక్కు పాదం మోపాలని డిమాండ్‌ చేశారు.
 
వాళ్లని కాళ్ళ కింద పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. జగన్ సీఎం అయ్యాక సినిమా వాళ్ళందరినీ పిలిపించుకొని ఫోటోలకు ఫోజులు కొట్టి దండం పెట్టించుకున్నట్లు మన సీఎం అయ్యాక ఎందుకు చేయించుకోకూడదు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడని మాధవి లత ప్రశ్నించారు. మాధవి లతా చేసిన ఈ హాట్ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: