సినిమా ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో అగ్ర హీరోలు అందరు సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి గురించి పరిచయం అవసరం లేదు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి నటి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ధడక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుస అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నారు.అలాగే ఎన్టీఆర్ దేవర సినిమా తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.స్టార్ కిడ్ అనే మార్క్ పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్ కోసమే తన టైమ్ స్పెండ్ చేస్తూ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది జాన్వీకపూర్. సామజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే దర్శనమిస్తున్నాయి.పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీకి కామన్. పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తుంటుంది జాన్వీకపూర్. ఈ క్రమంలోనే ఆమె ట్రోలింగ్‌కి గురైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.తనను తాను నటిగా ఇండస్ట్రీలో నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది జాన్వీ కపూర్.
విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల దృష్టిలో పడుతోంది. టాలెంట్ తో పాటు అందచందాలతో మెస్మరైజ్ చేస్తోంది.బాలీవుడ్ లో మిలి, మిస్టర్ అండ్ మిస్ మహి వంటి సినిమాల్లో నటించిన జాన్వీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు స్పెషల్ ప్రియార్టీ ఇస్తోంది. రోటీన్ కు భిన్నంగా ఉండే రోల్స్ ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించే ప్రయత్నాల్లో ఉంది జాన్వీ.ఇదిలావుండగా అందరు గ్లామర్ షో చేస్తారు కానీ జాన్వి చేస్తున్న షో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది.అందుకే ముందు చెప్పినట్టుగా జాన్వి కపూర్ గ్లామర్ కి ఒక లెక్క ఉంటుందనిపిస్తుంది అంటే అందరు నిజమే అని ఒప్పుకోవాల్సిందే. ముఖ్యంగా జాన్వి లేటెస్ట్ గా డార్క్ క్రీం కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో దేవకన్య ఇలా నేల మీదకు వచ్చిందా అనిపించేలా చేస్తుంది. ఆడియన్స్ ని బుట్టలో వేసుకోవాలో బాగా తెలిసిన జాన్వి కపూర్ తన గ్లామర్ టీట్ తో ఫాలోవర్స్ కి నోట మాట రాకుండా చేస్తుంది. అందుకే సినిమా అయినా ఫోటో షూట్ అయినా జాన్వి ని మించిన వారు లేరని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక జాన్వీకి తెలుగులో మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.అదే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో rc17 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చాలా పేర్లు పరిశీలించిన టీమ్ చివరకు జాన్వీని ఓకే చేసినట్లు టాక్.