'ఉస్తాద్' ని భయపెడుతున్న 'బేబీ జాన్'.. హరీష్ పైనే అంతా భారం..!!
వాళ్ళ సంగతి పక్కనపెడితే తెరీకి కొద్దిపాటి మార్పులు చేసిన అట్లీ ఒరిజినల్ వెర్షన్ నుంచి చాలా సీన్లు, ఎపిసోడ్లు యధాతథంగా తీసుకున్నాడు. గెటప్స్, బిల్డప్స్ లో వ్యత్యాసం తప్పించి మిగిలినదంతా సేమ్ టు సేమ్. అయితే విజయ్ స్వాగ్ ని వరుణ్ ధావన్ మ్యాచ్ చేయలేకపోయాడు. ఈ క్రమంలో తేరిని చూసినవాళ్లకు మాత్రం ఈ బేబీ జాన్ లో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు.ఈ నేపథ్యంలో ఇప్పుడు అలెర్ట్ అవ్వాల్సింది ఉస్తాద్ భగత్ సింగ్ బృందం. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్స్ వల్ల వాయిదా పడ్డ ఈ సినిమాను ఇంకో రెండు నెలల్లో రీ స్టార్ట్ చేసే అవకాశముంది. తేరి రీమేక్ కావడం పట్ల ఫ్యాన్స్ కొంత ఆందోళనగా ఉన్నా మార్పులు చేయడంలో మంచి టాలెంట్ ఉన్న హరీష్ శంకర్ దర్శకుడు కావడమే వాళ్లకు రిలీఫ్ ఇచ్చే అంశం. అయితే మిస్టర్ బచ్చన్ ఫలితం తిరిగి టెన్షన్ తెప్పించడం వేరే విషయం. ఏది ఎలా ఉన్నా వరుణ్ ధావన్ వల్ల కానిది పవన్ డబుల్ డోస్ లో చేసి చూపిస్తాడు. కాకపోతే ఎక్కడ పొరపాట్లు చేయకూడదో రిఫరెన్స్ గా వాడుకోవడానికి బేబీ జాన్ ఉపయోగపడుతుంది.