బాలకృష్ణ ముందు కుప్పిగంతులు ఏలా..?
బాలకృష్ణ తనయుడి సినిమాకు ఇలా జరగడంపై ఫ్యాన్స్ కాస్త అప్సెట్ లో ఉన్నా కూడా బాలకృష్ణ మళ్లీ వెనక ఉండి అంతా నడిపించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ డైరెక్టర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తుంది. బాలయ్య బాబు ముందు కుప్పి గంతులు వేస్తే ఎలా ఉంటుందో తెలిసిందే. అందుకే సినిమా విషయంలో ఆయన నిర్ణయం ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.
త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నారు. ఈమధ్యనే ఆ సినిమా నిర్మాణ సంస్థ నుంచి ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న ఫేక్ వార్తలు నమ్మొద్దని చెప్పారు. ఐతే ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ తొలి సినిమా అప్డెట్స్ కోసం ఈగర్ గా ఉన్నారు. సినిమా సెట్స్ మీదకు వెళ్లే వరకు ఈ సినిమా గురించి డౌట్ గానే ఉందని తెలుస్తుంది. ఐతే రంగంలోకి బాలకృష్ణ దిగాడు కాబట్టి ఇప్పుడు అంతా సెట్ అవుతుందని అనుకుంటున్నారు. బాలయ్య బాబు తన సినిమాలతో పాటు ఇక మీద వారసుడి సినిమా కోసం కూడా టైం స్పెండ్ చేయనున్నాడు. తప్పకుండా మోక్షజ్ఞ సినిమాను ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగానే ఉండేలా చూస్తున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమానే కాదు రెండో సినిమా డిస్కషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా అప్డేట్ తో ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమా ఏదవుతుంది.. ఆ సినిమా అప్డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి.