మళ్ళీ వైరల్ అవుతున్న గరికపాటి వీడియో.. బన్నీకి దెబ్బ మీద దెబ్బ..!!

murali krishna
అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన దేశవ్యాప్తం గా సంచలనం గా మారింది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగానే ఓ నిండు ప్రాణం పోయిందని..ఘటనకు మరో వెర్షన్ ని కూడా వినిపించడం మరింత హాట్ టాపిక్ గా మారింది. దీంతో అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భారీగా పోస్టులు పెడుతున్నారు నెటిజన్ల. మరోవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఘటన సంబంధించి చెప్పిన సమాదానాలకు, థియేటర్ దగ్గర ఆయన చేసిన దానికి ఏ మాత్రం పొంతన లేనట్లుగా వీడియోలు వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. బన్నీ అబద్ధాలు చెబుతున్నాడంటూ నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. ఇందులో భాగంగా.. 'పుష్ప' సినిమా విడుదలైన కొత్తలోదని చెబుతున్న ఈ వీడియో నెట్టింట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో హీరో ఫేమస్ డైలాగ్ “తగ్గేదేలే” అనే దానిపై ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు మరోమారు తెరపైకి వచ్చాయి.అవును… 'పుష్ప' సినిమాలోని “తగ్గేదేలే” అనే డైలాగ్ పై గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. “స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదే లే అంటాడా.. రేపు ఏ పిల్లవాడు ఎవరినైనా కొట్టి తగ్గేదేలే అంటాడు.. దానికి ఎవరు కారణం..? ఆ సినిమా డైరెక్టర్, హీరో కనబడితే కడిగిపారేస్తాను” అని గరికపాటి మండిపడ్డారు. ఇదే సమయం లో తగ్గేదేలే అని ఒక హరిశ్చంద్రుడు, శ్రీరామ చంద్రుడు వంటి వారు అనాలి కానీ ఓ స్మగ్లర్ అనడం ఏమిటి? అంటూ గరికపాటి నరసింహారావు ఫైర్ అయ్యారు! ఈ వీడియో ఎప్పటిదో అయినప్పటికీ… తాజా పరిణామాల నేపథ్యంలో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: