వివాహమైన పది రోజులకే కీర్తి సురేష్ షాక్.. హర్ట్ అవుతున్న ఫ్యాన్స్..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో మహానటిగా పేరుపొందిన హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు ఆయన ఆంటోనీని ప్రేమించి మరి గోవాలో వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహాన్ని రెండు సాంప్రదాయమైన పద్ధతిలో చేసుకుంది. ఒకటి హిందూ సాంప్రదాయంలో మరొకటి క్రైస్తవ సాంప్రదాయంలో ఆంటోని వివాహం చేసుకుంది. అంతేకాకుండా వివాహమైన తర్వాత హనీమూన్ కి వెళ్లకుండా  బాలీవుడ్ లో తను నటించిన బేబీ జాన్  సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి తాళిబొట్టుతో వెళ్లడంతో అందరూ ఆశ్చర్యపోయారు. చాలామంది సెలబ్రిటీలను ట్రోల్ చేసి కీర్తి సురేష్ ని చూసి నేర్చుకోండి అంటూ కితాబు కూడా ఇచ్చారు.

బాలీవుడ్లో నటిస్తున్న బేబీ జాన్ సినిమా కాకుండా కీర్తి సురేష్ చేతిలో రివాల్వర్ రిటా, కన్నెవెది అనే రెండు చిత్రాలు ఉన్నాయట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులు  పూర్తి అయినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత కొత్త సినిమాలకు కీర్తి సురేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఇక మీదట తాను సినిమాలలో నటించకూడదని నిర్ణయం కూడా తీసుకున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వివాహం తర్వాత కీర్తి సురేష్ ఎక్కువ సమయాన్ని తన భర్తతో గడపాలని అందుకే సినిమాలకు దూరంగా ఉండాలనే ఆలోచనలతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే కీర్తి సురేష్ కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని రీఎంట్రీ ఇస్తుందా లేకపోతే పూర్తిగా సినిమాలకు దూరమవుతుందా అనే విషయం మాత్రం తెలియడం లేదు.. కానీ కీర్తి సురేష్ సినిమాలకు దూరం అవుతుందని విషయం అభిమానులకు తెలియగానే అభిమానులు హర్ట్ అవుతున్నామని కామెంట్స్ చేస్తున్నారు.. ముఖ్యంగా చాలామంది హీరోయిన్స్ వివాహమైన తర్వాత కూడా ఒకవైపు కుటుంబంతో మరొకవైపు సినిమాలలో నటిస్తూ ఉన్నారు అంటూ కీర్తి సురేష్ కి సలహా ఇస్తూ ఉన్నారు. మరి కీర్తి సురేష్ మీద వస్తున్న ఈ రూమర్స్ పైన ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: