బ‌న్నీ అతితో టాలీవుడ్‌ను నిండా ముంచేశాడా..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )  . .

గత పద కొండు సంత్సరాలుగా తెలంగాణాలో సినీ పరిశ్రమ ఏది కోరుకుంటే అదే అలాగే జరిగిపోయింది. అటు కెసిఆర్ సర్కారు వాళ్ల‌కు కావాల్సిన వ‌రాలు ఇచ్చింది. ఇక అప్ప‌టి మంత్రి కేటీఆర్ తో ఇండ‌స్ట్రీ జ‌నాలు చాలా అంటే చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లు. కేసీఆర్ ప్ర‌భుత్వం హీరోలు .. ద‌ర్శ‌కుల‌కు కావాల్సినంత మేళ్లు చేస్తూ వ‌చ్చారు. భారీ బడ్జెట్ సినిమా లు అంటూ రేట్లు పెంచుకోవటానికి ఒక అస్త్రంగా వాడుకుంటూ వస్తూ ఉన్నారు. తెలంగాలో మాత్రం ఇప్పుడు ఒక్కసారి గా లెక్కలు బాగా మారాయి. అల్లు అర్జున్ అతి తో మొత్తం టాలీవుడ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ‌బుల్‌ షాక్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో తాను సీఎం సీటు లో ఉన్నత కాలం తెలంగాణ లో బెనిఫిట్ షోస్ , అదనపు రేట్లు ఉండవు అని క్లీయ‌ర్ గా చెప్పేశారు.

నిజంగా అల్లు అర్జున్ తో సీఎం రేవంత్ రెడ్డి కి ఏదైనా విబేధాలు లేవు. ఎందుకంటే ?  పుష్ప 2 సినిమా కు గ‌తంలో టాలీవుడ్ చ‌రిత్ర లోనే ఏ సినిమాకు ఇవ్వ‌నంత టిక్కెట్ రేట్ల పెంపు తో పాటు కావాల్సిన‌న్ని షోలు వేసుకునేందుకు అవ‌కాశం ఇచ్చారు. ఇక్క‌డ సంఘ‌ట‌న త‌ర్వాత అల్లు అర్జున్ తీరు వివాదాస్పదం అవుతోంది. ఇక్క‌డ మ‌రో మంచి పాయింట్ ఏంటంటే ఎవరి డబ్బులతో సినీ రకరకాల స్టేటస్ లు అనుభవిస్తున్నారో వాళ్ళ విషయంలో కనీసం మానవత్వం లేకుండా చనిపోయిన వాళ్ళ విషయంలో మాట కూడా మాట్లాడకుండా ఇండ‌స్ట్రీ జ‌నాలు అంద‌రూ అల్లు అర్జున్ కు మాత్ర‌మే సంఘీభావం తెలుపుతూ వ‌చ్చారు.

ఇక రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో మాట్లాడితే వెంట‌నే అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ సీఎం కే కౌంట‌ర్ ఇస్తున్న‌ట్టు మాట్లాడ‌డం మ‌రింత ముదిరేలా చేసింది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం తప్పు కాదు ..  కేసు కోర్టు లో ఉన్నప్పుడు సీఎం చెప్పిన దాంట్లో తప్పులు ఉంటే...సహజంగా నోట్ విడుదల చేయటం.. లేదా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తారు. బ‌న్నీ ఏకంగా త‌న వ్య‌క్తిత్వ హ‌న‌నం చేస్తున్నార‌ని .. త‌న క్యారెక్ట‌ర్ .. త‌న ఇమేజ్ డ్యామేజ్ చేయాల‌ని చూస్తున్నారంటూ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఇవ‌న్నీ బ‌న్నీ అతి గా చేశార‌ని.. ఇది టాలీవుడ్ కే న‌ష్టం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: