జానీ మాస్టర్ కు రామ్ చరణ్ సపోర్ట్... ఫోన్ చేసి ఏమన్నాడంటే?
ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ నుంచి జానీ మాస్టర్ కంపోజ్ చేసిన 'ధూప్' అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ప్రోమో తో రిలీజ్ అయిన ఈ సాంగ్ లోని చరణ్ వేసిన స్టెప్ లకి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కూడా ఫుల్ ఫిదా అయిపోతున్నారు.
ఇక టాలీవుడ్ స్టార్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం కేవలం ఇండస్ట్రీలోనే కాదు రెండు రాష్టాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనపై లైంగిక దాడి చేశాడని ఒక లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేయడంతో జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ కస్టడీ గడువు ముగియడంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ వ్యవహారం బయటికి రావటం జరిగింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ ఆ అవార్డును కమిటీ రద్దు చేసింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ ఊహించని షాకులు తగిలాయి.