బన్నీ మార్కెట్ నిజంగానే 5 రెట్లు పెరిగిందా.. పుష్ప2 కలెక్షన్లలో నిజమెంత?

Reddy P Rajasekhar
నెల రోజుల క్రితం వరకు స్టార్ హీరో బన్నీ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమా ఏదనే ప్రశ్నకు పుష్ప ది రైజ్ సినిమా పేరు సమాధానంగా వినిపించేది. ఈ సినిమా అప్పట్లో ఏకంగా 360 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా పుష్ప ది రూల్ తెరకెక్కగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.
 
ఇప్పటికే ఈ సినిమా 1500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. దేవర సినిమా సాధించిన కలెక్షన్లతో పోల్చి చూస్తే ఈ సినిమా ఏకంగా మూడు రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించింది. అయితే బన్నీ మార్కెట్ నిజంగానే 5 రెట్లు పెరిగిందా అనే ప్రశ్నకు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ రేట్లు భారీగా పెంచడం పుష్ప ది రూల్ సినిమాకు వరం అయిందని చెప్పవచ్చు.
 
పుష్ప ది రూల్ కలెక్షన్లలో కొంతమేర తేడాలు ఉండవచ్చు కానీ కలెక్షన్లు మాత్రం జెన్యూన్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ పెరిగిన మార్కెట్ కు పుష్ప ది రూల్ కలెక్షన్లు నిదర్శనమని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పుష్ప ది రూల్ మూవీ సాధించిన కలెక్షన్ల విషయంలో నిర్మాతలు సైతం సంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.
 
అయితే పుష్ప ది రూల్ మూవీ సక్సెస్ సాధించడానికి ఇతర కారణాలు సైతం ఉన్నాయని చెప్పవచ్చు. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. పుష్ప ది రూల్ సక్సెస్ తో సుకుమార్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. పుష్ప ది రూల్ కలెక్షన్ల విషయంలో మరిన్ని క్రేజీ రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బన్నీ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: