డాకు మహారాజ్ రిలీజ్ కాకుండానే బాబికి బంపర్ ఆఫర్.. ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బాబి ఒకరు. ఈయన మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన పవర్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత నుండి ఈయన చాలా సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో కొన్ని విజయాలను సాధించగా మరికొన్ని అపజయాలను అందుకున్నాయి. ఏదేమైనా కూడా ఈయన తన కెరియర్ను మంచి జోష్లోనే ముందుకు సాగిస్తున్నాడు.

ఆఖరుగా ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీ తో బాబీ క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఈ దర్శకుడు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న డాకు మహారాజ్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ప్రస్తుతానికి ఈ మూవీ.పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల కాక ముందే బాబీ కి ఓ స్టార్ హీరో సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... బాబి కి ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. కొన్ని రోజుల క్రితమే బాబి , ప్రభాస్ కి ఓ కథను వినిపించగా ఆ కథ అద్భుతంగా నచ్చడంతో ఆయన కూడా బాబీ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓవర్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: