రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ మళ్ళీ ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు.. భారీ స్థాయిలోతెరకెక్కిన విజయ్ దేవరకొండ “ లైగర్ “ సినిమా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయి భారీ డిజాస్టర్ గా నిలిచింది..డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.. ఈ సినిమాను నటి ఛార్మి కౌర్, పూరీ సంయుక్తంగా నిర్మించారు.. లైగర్ ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ పై బాగా పడింది.. లైగర్ సినిమా తరువాత విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు.లవ్ అండ్ ఫ్యామిలీ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు.. దీనితో యావరేజ్ గా నిలిచింది..
ఈ సినిమా తరువాత తనకి గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరశురామ్ డైరెక్షన్ లో “ ది ఫ్యామిలీ స్టార్ “ అనే మూవీ చేసాడు.. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు.. ఈ సినిమాలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.. ఈ ఏడాది ఏప్రిల్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేక పోయింది.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకి బోర్ కొట్టించింది.. విజయ్, మృణాల్ నటన బాగున్నా కానీ ఆడియన్స్ కి మాత్రం నచ్చలేదు.. దీనితో ఈ సినిమా వెంటనే ఓటిటిలోకి వచ్చింది.. అయితే ఓటిటి లో మాత్రం ఈ సినిమా అదరగొట్టింది. ఓటిటిలో “ ది ఫ్యామిలీ స్టార్ “ కు అదిరిపోయే వ్యూస్ లభించాయి.. అలాగే టెలివిజన్ లో సైతం ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు..దీనితో విజయ్ ఈ సారి ప్రేక్షకులని ఏ మాత్రం డిస్సపాయింట్ చేయకూడదని డిసైడ్ అయ్యారు..