బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడానికి ముహూర్తం కుదరడం లేదో ఏమో తెలియదు కానీ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మొదటి సినిమా అనుకున్నప్పటికీ దానికి ఆదిలోనే అంతం పడింది. సినిమాకి కథ నేనే అందిస్తాను కానీ డైరెక్షన్ మాత్రం నా అసిస్టెంట్ చేస్తాడని ప్రశాంత్ వర్మ చెప్పాడట. దాంతో బాలకృష్ణ వద్దని చెప్పడంతో ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మూవీ ఆగిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పక్కన పెడితే..తన తండ్రి బాలకృష్ణను పట్టిస్తే 50 లక్షల ప్రైజ్ మనీని ఆఫర్ చేశారు మోక్షజ్ఞ.మరి ఇంతకీ బాలకృష్ణ ఎక్కడికి వెళ్లారు..ఆయన్ని పట్టిస్తే 50 లక్షలు ఇస్తానని మోక్షజ్ఞ ఎందుకు పోస్టు పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం..
తండ్రిని పట్టిస్తే 50 లక్షలు ఇస్తానని మోక్షజ్ఞ పెట్టింది ఎందుకో కాదు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ని ఉద్దేశించి..తాజాగా మోక్షజ్ఞ తన సోషల్ మీడియా ఖాతాలో వాంటెడ్ డాకు మహారాజ్ అని పోస్ట్ పెట్టి 50 లక్షల ప్రైజ్ మనీ అని రాసుకోచ్చారు. ఇందులో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలోని డాకు మహారాజ్ ఫోటో మీద వాంటెడ్ అని ఉండే పిక్చర్ ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం మోక్షజ్ఞ పెట్టిన ఈ పోస్టు నెట్టింట ట్రైండింగ్ లో ఉంది.
ఇక డాకు మహారాజ్ సినిమా నుండి విడుదలైన డేగ డేగ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా సంక్రాంతి కానుక గా జనవరి 12 న రాబోతున్న నేపథ్యంలో ఇప్పటినుండే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇక డాకు మహారాజు మూవీకి బాబీ దర్శకత్వం వహించగా సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీలు సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శ్రద్ధ శ్రీనాథ్,ప్రగ్యా జైస్వాల్ లు నటిస్తున్నారు.