అల్లు అర్జున్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలనం.. తప్పు పుష్పాదేనా?

అల్లు అర్జున్ రిమాండ్ సమయం నాంపల్లి కోర్టు లో వాదనలలో ఓ సంచలనం బయటపడినట్టు ప్రచారం జరుగుతోంది. పుష్ప -2 ప్రీమియర్ షో కు హీరో,  హీరోయిన్స్ చిత్ర యూనిట్ వస్తున్నట్లు పోలీసుల అనుమతిని థియేటర్ యాజమాన్యం కోరిన సంగతి తెలిసిందే. దీన్ని చూసి థియేటర్‌ వాళ్ల తప్పులేదని అంతా భావిస్తున్నారు. అయితే.. హీరో, హీరోయిన్స్ స్పెషల్ షో కు రావడం తో క్రౌడ్ విపరీతంగా ఉంటుందని థియేటర్ యాజమాన్యంకు పోలీసులు సూచించిన విషయం రిమాండ్ రిపోర్ట్‌లో వెలుగు చూసినట్టు తెలుస్తోంది.

హీరో, హీరోయిన్‌ రావొద్దని థియేటర్ యాజమాన్యంకు పోలీసులు సమాచారం ఇచ్చినట్టు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. వ్రాత పూర్వకంగా చిక్కడపల్లి పోలీసులు ఇచ్చారని.. అయినా పోలీసుల మాట వినకుండా హీరో వచ్చారని  రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. హీరో రావడంమే కాకుండా అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టారని  రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

అయితే.. ర్యాలీ కి అనుమతి తీసుకున్నారా అని అల్లు అర్జున్ తరపు న్యాయవాదిని పీపీ ప్రశ్నించారు. ర్యాలీకి సంబంధించిన అన్ని వీడియోలు, ఫోటోలు కోర్టుకు పోలీసులు సమర్పించారు. హీరో రావడం తో ఒక్కసారి థియేటర్ లోకి దూసుకెళ్లిన అభిమానులు.. ఈ ఘటన లో  సృహ కోల్పోయిన రేవతి.. వెంటనే రేవతికి, వారి బాబు శ్రీ తేజ్ కు చిక్కడపల్లి పోలీసులు పీసీఆర్‌ చేసి ఆస్పత్రికి తరలించారని  రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

హాస్పిటల్ లో రేవతి మృతి చెందిందని.. రేవతి మృతి విన్న తర్వాత అల్లు అర్జున్ ను పోలీసులు బయటకు పంపించారు. మళ్ళీ వెళ్లే సమయంలో కూడా కార్ ఎక్కి ర్యాలీ ద్వారా అభిమానులకు అల్లు అర్జున్ అభివాదం తెలిపారని.. రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ రిమాండ్ వాదనల సమయం ఇదే అంశాన్ని పీపీ కోర్టు తెలిపారని తెలుస్తోంది. అందుకే అల్లు అర్జున్ కు  నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా అల్లు అర్జున్ బయటకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: