టాలీవుడ్‌లో మెరుపులా మెరిసి మాయమైపోయిన స్టార్‌ హీరోలు వీళ్లే..!

Amruth kumar
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథానాయకులకు కొరత లేదు. ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక హీరోలు ఉన్నది టాలీవుడ్ లోనే. 80వ దశకం వరకు తెలుగులో పట్టుమని పదిమంది హీరోలు కూడా లేరు. కానీ ఆ తర్వాతి కాలంలో హీరోల సంఖ్య భారీగా పెరిగిపోతూ వచ్చింది. ఒక దశలో కమెడియన్లు సైతం హీరోలుగా మారారు. తీవ్ర పోటి ఏర్పడింది. ఆ పోటీని తట్టుకుని కొందరు హీరోలు స్ట్రాంగ్ గా నిలబడితే.. మరికొందరు వెండితెరపై మెరుపులా మెరిసి మాయం అయ్యారు. మరి అలాంటి టాలీవుడ్ హీరోలు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం.రాజా: 2002లో ఓ చిన్నదానా మూవీతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన రాజా.. శేఖర్ కమ్ముల తెర‌కెక్కించిన ఫీల్ గుడ్ మూవీ `ఆనంద్‌`తో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత హీరోగా చాలా చిత్రాల్లో న‌టించాడు. కానీ ఆనంద్ స్థాయిలో హిట్ ప‌డ‌లేదు. దాంతో ప‌లు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా న‌టించిన రాజా.. ఇండ‌స్ట్రీలో ఉన్న పాలిటిక్స్ కార‌ణంగా 2013లో యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేశాడు. సినిమాలకు దూరమై క్రైస్తవ పాస్టర్ గా కొత్త జీవితాన్ని ఆరంభించాడు.తరుణ్: వెండితెర‌పై ఓ వెలుగు వెలిగి ప‌త్తా లేకుండా పోయిన టాలీవుడ్ హీరోల్లో త‌రుణ్ ఒక‌రు. న‌టి రోజా రమణి మరియు ఒడియా డైరెక్టర్ సుశాంత్ చక్రపాణి కుమారుడైన త‌రుణ్ కుమార్‌.. 1990లో మనసు మమత అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. సౌత్ భాష‌ల్లో దాదాపు 15 చిత్రాల్లో బాల‌న‌టుడిగా ప‌ని చేసిన త‌రుణ్‌.. 2000వ సంవ‌త్స‌రంలో నువ్వే కావాలి వంటి సూప‌ర్ హిట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అన‌తి కాలంలో భారీ స్టార్డ‌మ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత తక్కువ కాలంలోనే స్టార్డం తెచ్చుకొని తర్వాత సరైన హిట్స్ లేక టాలీవుడ్ లో కనిపించకుండా పోయాడు.


వేణు తొట్టెంపూడి:  మరో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి 1999లో స్వయంవరం సినిమాతో కెరియర్ను మొదలుపెట్టి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకని తర్వాత వరుస విజయాలతో టాలీవుడ్ లో దూసుకుపోయాడు .. రెండువేల తొమ్మిది తర్వాత సరైన హిట్ లేకపోవడంతో వేణు కూడా ఇండస్ట్రీకి దూరమై వ్యాపారాల్లోిజీ అయ్యారు. వడ్డే నవీన్: మరో టాలీవుడ్ సీనియర్ హీరో వడ్డే నవీన్ కూడా టాలీవుడ్ సీనియర్ వడ్డే నరేష్ కొడుకుగా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్ .. 1997లో  కోరుకున్న ప్రియుడు సినిమాతో హీరోగా అడుగుపెట్టాడు .. తొలి మంచి విజయం అందుకోవటంతో లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు .. తర్వాత పెళ్లి సినిమాతో నవీన్ కు బ్లాక్ బస్టర్ హీట్ వచ్చింది .. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు .. సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు .. నవీన్ తన కెరియర్ లో ఎంత వేగంగా గాడు అంతే వేగంగా పడిపోయాడు .. 28 సినిమాల్లో హీరోగా నటించిన నవీన్ .. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ..ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు.


ఆర్యన్ రాజేష్: లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మరియు నిర్మాత EVV సత్యనారాయణ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఆర్య‌న్ రాజేష్‌.. హాయ్ మూవీతో హీరోగా మారి సొంతంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆర్య‌న్ రాజేష్ లుక్స్‌, న‌ట‌నా ప్ర‌తిభ చూసి అత‌ను స్టార్ హీరో అవుతాడ‌ని అంద‌రూ భావించారు. కానీ అనుకున్న స్థాయిలో స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయాడు. ఎవడిగోల వాడిదే, ఆడంతే అదోటైపు, నువ్వంటే నాకిష్టం, అనుమానాస్పదం వంటి సినిమాల్లో యాక్ట్ చేసిన ఆర్య‌న్ రాజేష్‌.. చాలా త‌క్కువ టైమ్ లోనే ఫేడౌట్ హీరోల జాబితాలో చేరిపోయాడు.వెంకట్: వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రంతో వెంక‌ట్ మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. మరియు వెంకట్‌కి మరిన్ని సినిమా ఆఫర్స్ ను తెచ్చిపెట్టింది. కానీ సోలో హీరోగా కంటే మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లోనే వెంక‌ట్ కు ఎక్కువ‌గా ఛాన్సులు వ‌చ్చాయి. అవి అత‌నికి కెరీర్ కు పెద్ద‌గా ఉప‌యోక‌ప‌డ‌క‌పోవ‌డంతో.. కొంత‌కాలానికే వెంక‌ట్ కనుమరుగయ్యాడు. ఇక వీళ్లే కాకుండా తనీష్, యశో సాగర్, శివ బాలాజీ, సచిన్ జోషి, సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడు ఘట్టమనేని రమేష్ బాబు, జేడి చక్రవర్తి ,జైఆకాశ్‌, రోహిత్‌  వంటి హీరోలు కూడా వెండితెర‌పై మెరిసి మాయం అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: