పుష్ప 2: అల్లు అర్జున్ అరెస్ట్ తో పుష్ప2 ఖాతాలో మరో రికార్డ్..!

frame పుష్ప 2: అల్లు అర్జున్ అరెస్ట్ తో పుష్ప2 ఖాతాలో మరో రికార్డ్..!

Divya
డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కించిన పుష్ప 2 దిరూల్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.సుమారుగా 10 రోజులలోనే భారీ కలెక్షన్స్ ని రాబట్టింది.. ఇండియన్ చరిత్రలోనే సరికొత్త రికార్డులను తిరగరాస్తూ వస్తున్న పుష్ప 2 చిత్రం ఇప్పుడు హిందీ మార్కెట్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా హిందీలో అత్యధిక వేగంగా రూ .500 కోట్ల క్లబ్లో అడుగు పెట్టింది. ఇది సరికొత్త రికార్డు సృష్టించింది అంటూ చిత్ర బృందం వెల్లడించింది.

పుష్ప 2 ది రూల్ రికార్డు కొనసాగుతూ ఉన్నందుకు ఆనందంగా ఉందంటూ చిత్ర బృందం తెలియజేసింది. 2021 లో విడుదలైన పుష్ప ది రైజ్ చిత్రానికి కొనసాగింపుగానే  పుష్ప 2 దిరూల్ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. మైత్రి మూవీస్ మేకర్స్  ఈ చిత్రాన్ని నిర్మించారు.. అనసూయ, ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్ తదితర నటి నటులు ఇందులో కీలకమైన పాత్రలో నటించారు. అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక నటించిన ఈ సినిమా విడుదలైన ఆరు రోజులలోనే వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది.

అది తక్కువ సమయంలోనే 1000 కోట్లు రాబట్టిన చిత్రంగా పుష్ప 2 సినిమా నిలిచి ఉన్నది. అయితే అలాగే చిత్ర బృందం అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలుపుతూ అదేమిటంటే పుష్ప 2 చిత్రం 3d లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని హైదరాబాదులో ఇప్పటికే పలు థియేటర్లలో ఈ వర్షన్లో చూడవచ్చు అంటూ చిత్ర బృందం తెలియజేసింది త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చేస్తున్నామంటూ వెల్లడించారు.. అల్లు అర్జున్ ని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.. సంధ్య థియేటర్లో జరిగిన ఘటన వల్ల అల్లు అర్జున్ ని అరెస్ట్  అయ్యి బెయిల్ మీద బయటకి వచ్చిన ఘటన..మరొకవైపు పుష్ప 2 కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: