ఒకే హోటల్ లో అతనితో రాత్రంతా గడిపిన త్రిష ?
గత కొద్ది రోజుల పాటు తెలుగు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ చిన్నది పోన్నియిన్ సెల్వన్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం తెలుగులో వరుసగా కొన్ని సినిమాలలో నటించడానికి ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం హీరోయిన్ త్రిష తెలుగు, తమిళం సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇదిలా ఉండగా రీసెంట్ గా నటి కీర్తి సురేష్ వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి సినీ నటులు అందరూ వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ క్రమంలోనే త్రిష కూడా గోవాకు కీర్తి సురేష్ వివాహానికి హాజరు అయ్యారు. అయితే తాను ఒక్కరే వెళ్లలేదట. తమిళ హీరో విజయ్ తో కలిసి గోవా వెళ్లిందట. వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై విజయ్, త్రిష ఇంత వరకు స్పందించలేదు. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కారణంగానే త్రిష ఓ ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేసిందట.
అది కూడా విజయ్ హీరోగా చేసిన గోట్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది హీరోయిన్ త్రిష. గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ కొనసాగుతున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీరిద్దరూ కలిసి గోవాకు వెళ్లడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అంతే కాకుండా గోవాలో ఒకే రూమ్ తీసుకొని ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.