పెళ్లైన వారం రోజులకే...చైతూతో శోభితకు గొడవ ?
మరోవైపు శోభిత కూడా సినిమాలతో బిజీగా ఉంది. మరి ఇప్పుడు శోభిత సినిమాలలో నటిస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే ఇప్పటికే తాను ఒప్పుకున్న ప్రాజెక్టులలో మాత్రమే నటించి అనంతరం సినిమాలలో నటించకూడదని అనుకుంటుందట. దానికి గల ప్రధాన కారణం నాగచైతన్యకు శోభిత సినిమాలలో నటించడం అస్సలు ఇష్టం లేదట. తన పూర్తి సమయాన్ని కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే గడపాలని నాగచైతన్య అనుకుంటున్నాడట.
మరి ఈ విషయంపై శోభిత ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.... శోభిత, నాగచైతన్య చాలా రోజులపాటు ప్రేమలో ఉండి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి గల ప్రధాన కారణం వీరిద్దరి అభిప్రాయాలు, ఇష్టాలు ఒకే రకంగా ఉండడంతో వివాహం చేసుకున్నారు. అయితే చైతు, శోభిత వివాహం జరిగి కేవలం వారం రోజులే అవుతుంది.
కానీ కేవలం వారం రోజులకి కొత్త జంట మధ్యలో గొడవలు ప్రారంభమయ్యాయట. శోభిత బయటకు వెళ్లే సమయంలో తనకు నచ్చిన డ్రెస్ వేసుకుందట. దానికి నాగచైతన్య వద్దు అని చెప్పడంతో శోభిత కాస్త గొడవ పెట్టుకుందట. నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను అని గొడవ పెట్టుకుందట. ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. పెళ్లైన వారం రోజులకే గొడవలు పెట్టుకోవడం అవసరమా అని కొంతమంది నెగటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.