అల్లు అర్జున్: బెయిల్ ఇప్పించిన లాయర్ ఫీజు ఎంతో తెలిస్తే షాకే..!

Divya
నిన్నటి రోజున అల్లు అర్జున్ అరెస్ట్ తో పాటుగా బెయిల్ వ్యవహారం కూడా నిన్నటి రోజున ఆసక్తికరంగా నిలిచింది.. ముఖ్యంగా అల్లు అర్జున్ కు బెయిల్ ఇప్పించిన లాయర్ ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ఆయన ఎంత ఫీజు వసూలు చేస్తారనే విషయంపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు చాలా ఆసక్తిగా వెతికేస్తూ ఉన్నారు.. అల్లు అర్జున్ తరఫున తెలంగాణ హైకోర్టులో వాదించిన లాయర్ పేరు ఏంటో కాదు నిరంజన్ రెడ్డి..

నిరంజన్ రెడ్డికి చాలా ప్రత్యేకమైన బ్యాక్ గ్రౌండ్ కూడా ఉన్నది.ఈయన లాయర్ కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారట.. గతంలో నాలుగైదు తెలుగు చిత్రాలకు కూడా ప్రొడ్యూసర్ గా కూడా చేశారట. నిరంజన్ రెడ్డిది తెలంగాణ ప్రాంతంలో నిర్మల ప్రాంతమట.. ఈయన తండ్రి విద్యాసాగర్ రెడ్డి కూడా ఒక లాయర్.. 1992లో నిరంజన్ రెడ్డి లా చదువుకొని పూర్తి చేశారట. అలా 2011 లో వచ్చిన గగనం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిరంజన్ రెడ్డి ఆ తర్వాత క్షణం, వైల్డ్ డాగ్, ఘాజి, ఆచార్య వంటి చిత్రాలను నిర్మించారట.

2002లో వైసిపి పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.. అయితే నిరంజన్ రెడ్డి లాయర్ గా ఎంత ఫీజు తీసుకుంటారని విషయానికి వస్తే .. అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించడంతో ఒకసారిగా ఈయన పేరు వైరల్ గా మారుతోంది.. ఈయన గంటకు రూ .5 లక్షల రూపాయలు వసూలు చేస్తారని సమాచారం.అల్లు అర్జున్ కి నిన్నటి రోజున బెయిల్ ఇప్పించిన విషయంలో కూడా ఈయన పాత్ర చాలా ఉన్నది.. నిజానికి నాంపల్లి కోర్టు 14 రోజులపాటు కష్టపడి విధించిన హైకోర్టులో వాదనలు చాలా వాడి వేడిగా కొనసాగాయట. ఇలాంటి పరిస్థితులలో అల్లు అర్జున్ కు కోర్టు మభ్యంతర బెయిల్ ను సైతం ఇప్పించడానికి తన అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించారు నిరంజన్ రెడ్డి.. చివరి కి ఆయన వాదనలు ఫలించి అల్లు అర్జున్ ఈరోజు ఉదయం బెయిల్ నుంచి బయటికి వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: