జైల్లు నుంచి రిలీజ్ అయ్యాక అలా చేసిన అల్లు అర్జున్ .. రివేంజ్ తీర్చుకోబోతున్నాడా..?

Thota Jaya Madhuri
రాత్రి అంతా కూడా హైదరాబాద్ చంచల్ గూడా జైలు లోనే అల్లు అర్జున్ ఇరుక్కుపోయిన సంగతి అందరికి తెలిసిందే . నిజానికి గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం అల్లుఅర్జున్ నిన్న సాయంత్రం రిలీజ్ కావాల్సింది కానీ ఆ డాక్యుమెంట్స్ రాలేదు ఈ డాక్యుమెంట్స్ రాలేదు అంటూ ఆలస్యం జరిగింది అన్న వార్తలు వినిపించాయి.  అంతేకాదు మరి ముఖ్యంగా అల్లు అర్జున్ ని కావాలని రిలీజ్ కాకుండా ఆపేశారు అన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి . సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కారణంగా అల్లు అర్జున్ ని తెలంగాణ పోలీసులు నిన్న మధ్యాహ్నం 11 గంటల 45 నిమిషాలకు అరెస్ట్ చేశారు.


ఆ తరువాత ఎలా పరిస్ధితులు మారిపోయాయో మన అందరికి తెలిసినవే. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ పేరు మారుమ్రోగిపోతూవచ్చింది. పాన్ ఇండియా స్థాయి యాక్టర్ ని ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ ఓపెన్ గానే  స్టార్ సెలబ్రిటీస్ మాట్లాడారు. అయితే అల్లు అర్జున్ కి అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 7697 ఇచ్చినట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి . రాత్రి జైల్లో అల్లు అర్జున్ భోజనం కూడా చేయలేదట నేలపైనే అలాగే పడుకుండిపోయారట . ఇది అల్లు అర్జున్ జీవితంలోని మర్చిపోలేని రోజు భయానకముగా గడిచింది అంటూ కూడా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు .


అయితే అల్లు అర్జున్ జైల్లు నుంచి రిలీజ్ అయ్యాక చాలా సింపుల్ గా ఆయన తన కారులో వెళ్లిపోయారు . మరీ ముఖ్యంగా చేత్తో దండం పెడుతూ కారులో కూర్చున్నాక చేతులు ఊపుతూ  వెళ్లిపోవడం..ఆ విజువల్స్  వైరల్ గా మారింది. దీంతో అల్లు అర్జున్ నిజంగానే గట్టోడు అని అంత జరిగిన కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు అని తన వైపు తప్పులేదు కాబట్టే కావాలని రాజకీయాల్లో రంగు పూసి ఈ విధంగా టార్చర్ చేస్తున్నారని తెలుసుకున్నాడు బన్ని అంటున్నారు జనాలు. జనాలకు నిజా నిజాలు ఏంటో తెలుసు అని అంత ధీమాగా ఉన్నాడు బన్ని అంటున్నారు జనాలు . ప్రజెంట్ అల్లు అర్జున్ రిలీజ్ అయిన పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కొందరు అయితే ఖచ్చితంగా బన్నీ అమతకు అంత రివేంజ్ తీర్చుకుంటాడు అని అంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: