నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన సినిమాలలో ఎన్నో సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయిన సందర్భాలు ఉన్నాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన సినిమాలలో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తే మరికొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక ఘోర పరాజయాన్ని అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను అందుకున్న సినిమాలలో ఒక్క మగాడు మూవీ ఒకటి.
బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమాకు వై వి ఎస్ చౌదరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించాడు. ఈ సినిమాలో సిమ్రాన్ , అనుష్క , ప్రియాంక కొఠారి హీరోయిన్లుగా నటించగా ... మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ అత్యంత భారీ అంచనాల నడుమ 2008 వ సంవత్సరం జనవరి 11 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయకపోవడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయ్యింది. అలా భారీ అంచనాల నడుమ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలం కావడంతో ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.