మంచు ఫ్యామిలీ వివాదం చల్లారేనా.. ఆ స్టార్ హీరో జోక్యం చేసుకుంటే బెటర్!

Reddy P Rajasekhar
మంచు ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ వివాదం విషయంలో తప్పు ఎవరిదనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మంచు ఫ్యామిలీ వివాదం చల్లారాలంటే బాలయ్య జోక్యం చేసుకోవాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారుతున్న సంగతి తెలిసిందే. మరి బాలయ్య ఈ వివాదంలో జోక్యం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.
 
మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తుండటం వల్ల ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్నాయి. మంచు విష్ణు ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెడుతున్నారు.
 
మంచు విష్ణు రెమ్యునరేషన్ భారీగానే ఉండగా సొంత బ్యానర్ లోనే విష్ణు సినిమాలు తెరకెక్కుతున్నాయి. కన్నప్ప సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. కన్నప్ప సినిమా పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం విడుదల కానుండగా ఈ సినిమాలో ట్విస్టులు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. కన్నప్ప సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య మంచు ఫ్యామిలీకి సన్నిహితుడు కాగా ఆయన ఈ వివాదం విషయంలో జోక్యం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. మంచు హీరోలకు క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండగా మంచు ఫ్యామిలీ సమస్యలన్నీ పరిష్కారం కావాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మంచు ఫ్యామిలీ  హీరోలకు 2025 సంవత్సరం కలిసిరావాలని నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: