మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి , ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన మాస్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం గోపీచంద్ నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాయి. గోపీచంద్ ఆఖరుగా విశ్వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కావ్య ధాపర్ ఈ సినిమాలో గోపీచంద్ కు జోడిగా నటించగా ... శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోలేదు. ఇక వరుస అపజయాలను అందుకుంటున్న గోపీచంద్ కి వరుస పెట్టి సినిమా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఓ ముగ్గురు డైరెక్టర్లు గోపీచంద్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే .. గోపీచంద్ ఇది వరకు రాధాకృష్ణ దర్శకత్వం లో జిల్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. మరోసారి వీరి కాంబోలో మరో మూవీ తెరకెక్కబోతున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గోపీచంద్ "ఘాజి మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలను అందుకున్న సంకల్ప రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఇద్దరు దర్శకులతో పాటు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా గోపీచంద్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. గతంలో గోపీచంద్ , పూరి జగన్నాథ్ కాంబోలో సిటిమార్ అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా గోపీచంద్ ముగ్గురు డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.