అఖండ -2 విడుదల తేదీ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

Divya
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక కాంబో తెర పైన హిట్ కొట్టింది అంటే మళ్ళీ అదే కాంబో తెరపైకి రావడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు మేకర్స్. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను - బాలయ్య కాంబినేషన్ కి భారీ పాపులారిటీ ఉంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా.. మూడు చిత్రాలు కూడా హ్యాట్రిక్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు నాల్గవసారి వీరిద్దరి కాంబినేషన్లో అఖండ 2 రాబోతోంది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో 2021 డిసెంబర్ 2న భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం అఖండ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ సినిమా ద్వారా విలన్ గా హీరో శ్రీకాంత్ పరిచయం అవ్వగా.. ఉత్తమ ప్రతినాయకుడిగా ఆయనకు అవార్డు కూడా లభించింది.
ఈ సినిమా క్లైమాక్స్ లోనే అఖండ 2 ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలు కాబోతుంది అని అభిమానులు సైతం ఆత్రుతగా ఎదురు చూశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. మరొకవైపు బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంచారు. వచ్చే ఏడాది అనగా 2025 జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే తన తదుపరిచిత్రం షూటింగ్ ను బాలకృష్ణ ప్రారంభించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ పోస్టర్ తో  సహా విడుదల చేయడం జరిగింది. వచ్చే ఏడాది అనగా 2025 సెప్టెంబర్ 25వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు పోస్టర్తో సహా చిత్ర బృందం ప్రకటించింది. ఇకపోతే రౌద్రంతో త్రిశూలం పట్టుకొని నిలబడిన బాలకృష్ణ చెయ్యిని మాత్రమే చాలా పవర్ఫుల్ గా చూపించారు. మొత్తానికి అయితే పోస్టర్తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా మాస్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రాన్ని బాలయ్య చిన్న కూతురు తేజస్విని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: