నిజాలు అన్నీ బయట పెడతా.. మంచు మనోజ్ సంచలనం.. !
ఇక ప్రేమించి పెళ్లి చేసుకోవడం తాను చేసిన నేరమా ? అని మనోజ్ ప్రశ్నించారు. తన భార్యపై నిందలు వేయటం ఎంత వరకు ? . . కరెక్ట్ అని మనోజ్ నిలదీశారు. ఇదే తన భార్య తల్లిదండ్రులు ఉంటే ఊరుకునే వారా ? అని మనోజ్ ప్రశ్నించారు. తన భార్య కు తల్లి .. తండ్రి అన్ని తానే అని అన్నారు. ఆమెకు తను అండగా ఉంటానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులపై తాను ఎలాంటి దాడికి పాల్పడలేదని మనోజ్ కన్నీటి పర్యంతం అవుతూ చెప్పారు. ఇదిలా ఉంటే దివంగత నేతలు భూమా నాగిరెడ్డి - శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డికి అంతకుముందే ఒక వివాహం జరిగి ఒక కుమారుడు జన్మించారు.
అయితే ఆ దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే తనకు చిన్ననాటి మిత్రుడు అయిన మనోజ్ ప్రేమలో పడిన మౌనిక ఆ తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి మోహన్ బాబుకు ... మంచు విష్ణుకు ఇష్టం లేకపోయినా మనోజ్ సోదరి లక్ష్మీప్రసన్న కీలకంగా వ్యవహరించి దగ్గరుండి మరి పెళ్లి చేసిన సంగతి అప్పట్లో సంచలం రేపిన సంగతి తెలిసిందే.