ఏపీలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ అంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలే.. పెద్ద చిచ్చే పెట్టాడుగా..?
* రామ్ గోపాల్ వర్మ సినిమాలు వారిని ఎక్కువగా టార్గెట్ చేశాయి
* చివరికి పెద్ద ఇబ్బందుల్లో పడ్డ వర్మ
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
రామ్ గోపాల్ వర్మ ఒక ట్రెండ్ సెట్టర్ ఈ కాంట్రవర్షియల్ డైరెక్టర్ తన సినిమాల ద్వారా తెలుగు సినిమా రంగాన్ని కొత్త కోణంలో చూపించాడు తెలుగుతో పాటు హిందీ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు తీశారు. వర్మ తన సినిమాల్లో రియలిస్టిక్‌గా, నిజ జీవితానికి దగ్గరగా సన్నివేశాలను చూపిస్తుంటాడు. అంటే నిజ జీవితం ఎలా ఉంటుందో అలాగే ఆయన సినిమాల్లో చూపిస్తారు. ఆయన కొత్త కథలతో, కొత్త పద్ధతులతో తెలుగు సినిమా రంగాన్ని మార్చేశారు. అయితే ఇంత మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆడ్ చేయి ఎందుకో తెలియదు కానీ సడన్‌గా తన రూట్ మార్చాడు. పొలిటికల్ పర్సన్స్ మీద సినిమాలు తీయడం మొదలుపెట్టాడు.
ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 2024 లో వ్యూహం సినిమా రూపొందించాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దీనిని డైరెక్ట్ చేశాడు. టీడీపీకి వ్యతిరేకంగా ఈ మూవీ తీశాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు దీనిని ముందుగానే రిలీజ్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టారు. ఈ మూవీ కొన్ని నెలల క్రితం పెద్ద సంచలనమే సృష్టించింది అంతేకాదు ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను కించపరిచే లాగా మార్ఫింగ్ ఫోటోలు పెట్టారని పెద్ద రచ్చ జరిగింది. దీనిపై వర్మపై కేసులు కూడా నమోదు అయ్యాయి.
దీనికంటే ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట మరొక మూవీ చేశాడు. ఇది కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా తీసిన సినిమా కావడం విశేషం. ఇందులో ఎన్టీఆర్ ను చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు ఎలా ఇబ్బంది పెట్టారో చూపించే ప్రయత్నం చేశారు. ఇది 2019లో రిలీజ్ అయింది. ఇది కూడా సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రావడం విశేషం. "అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు" వంటి మరో పొలిటికల్ మూవీ కూడా తీశాడు. ఈ సినిమాల్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారిలా సిమిలర్ లుక్స్ ఉన్న నటులు పెట్టి మరీ ట్రోల్ చేయడం జరిగింది. ఆ సినిమాలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. తెలంగాణలో కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.