ఎఫ్-3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ నవ్వులు పూయించిన వెంకీ వరుణ్..మళ్ళీ వస్తున్నారా.?

Pandrala Sravanthi
ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు సీక్వెల్స్ తీస్తూ పార్ట్ 2 అని ప్రకటిస్తూ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతున్నారు. అలా బాహుబలి సినిమా నుండి ఈ సీక్వెల్ ల ప్రస్థానం కొనసాగుతూ వస్తుంది.బాహుబలి బాహుబలి 2, పుష్ప పుష్ప టు,భారతీయుడు భారతీయుడు టు, కిక్ కిక్ 2, డిజె టిల్లు,టిల్లు స్క్వేర్, కార్తికేయ కార్తికేయ టు వంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి.అయితే ఇలా సీక్వెల్ గా వచ్చిన కొన్ని సినిమాలు భారీ హీట్ అయితే మరికొన్ని సినిమాలు అట్టర్ ప్లాఫ్ అయ్యాయి.అలాంటి వాటిలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్2 సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఎఫ్ 3 సినిమా కూడా ఒకటి. మరి ఈ సినిమాకి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 ఎఫ్ -3 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్:

 అనిల్ రావిపూడి డైరెక్షన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మాతగా చేసిన ఎఫ్2 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రిన్ లు నటించారు. అయితే ఎఫ్2 సినిమాకి భారీ స్పందన రావడంతో దీనికి సీక్వెల్ గా ఎఫ్ త్రీ కూడా ఉంటుందని ప్రకటించారు డైరెక్టర్. ఇక దీనికి సీక్వెల్ గా వచ్చిన ఎఫ్ త్రీ సినిమా కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. అయితే ఎఫ్2 సినిమా అంతకాక పోయినప్పటికీ మిశ్రమ స్పందన అయితే తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా f4 సినిమా కూడా ఉంటుంది అని సినిమా చివర్లో అనిల్ రావిపూడి ప్రకటించారు.అలా 2022 మే 27న సమ్మర్ కానుకగా విడుదలైన f3 మూవీ మంచి టాక్ తెచ్చుకుంది.


ముఖ్యంగా ఈ సినిమా కామెడీ జానర్ లో వచ్చి హిట్ కొట్టింది. ఈ సినిమాలో వెంకీ వరుణ్ ల కామెడీ మామూలుగా ఉండదు. అలాగే తమన్నా మెహ్రిన్ లు వెంకీ వరుణ్ లను ఫూల్స్ ని చేయడం..వెంకీ రేచీకటి ఉన్నవాడి క్యారెక్టర్ లో, వరుణ్ తేజ్ నత్తి క్యారెక్టర్ లో నటించడం వంటివి మనం చూసాం. అలాగే ఈ సినిమాలో సునీల్,రాజేంద్రప్రసాద్,వెన్నెల కిషోర్ ప్రగతి ఇలా ఎంతోమంది తమ కామెడీతో మెప్పించారు.అలా ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఎఫ్3 సినిమా కూడా మంచి హిట్ కొట్టింది.అంతే కాకుండా ఈ సినిమాలో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ లో చేసి సినిమాకి మరింత ప్లస్ అయింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: