పుష్ప 3నే కాదు .. యానిమల్ 3 కూడా .. టైటిల్ ఏంటో తెలుసా..?

Amruth kumar
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ గత సంవత్సరం నటించిన ‘యానిమల్‌’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది .. ఇక ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తీసే పని జరుగుతుంది ‘యానిమల్‌’ పార్క్ అని ఇదివరకే టైటిల్ను కూడా అనౌన్స్ చేశారు .. అయితే రణ్‌బీర్ కపూర్ ఇప్పుడు యానిమల్ 3 కూడా చేయబోతున్నారని సమాచారం ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది ఎప్పుడు మొదలవుతుందని సమాచారం మాత్రం బయటకు రాలేదు .. యానిమల్ 2 షూటింగ్ 2027 నుంచి మొదలుకానందాన్ని రణ్‌బీర్ కపూర్ చెప్పిన .. య‌నిమల్ 3 ని మొదలు పెట్టడానికి ఇంకా చాలా టైం పడుతుందని అంటున్నారు.

ఈ సినిమాని మూడు భాగాలుగా తీయాలనుకుంటున్నాను రెండో భాగానికి య‌నిమల్ పార్క్ అనే టైటిల్ పెట్టారు .. ఇక మొదటి భాగం షూట్ చేస్తున్నప్పుడే దీని గురించి చర్చ జరిగిందట .. ఈ సినిమా నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది .. ఈ సినిమాలో భాగమైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని రణ్‌బీర్ కపూర్ చెప్పుకొచ్చారు .. కాగా ఈ సినిమా పార్ట్ 3 కు యానిమల్  కింగ్ డమ్ అనే టైటిల్ పెడితే  బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక రణ్‌బీర్ కపూర్ , రష్మిక మందన్న‌ జంటగా నటించిన య‌నిమల్ .. తండ్రి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే కొడుకు స్టోరీనే ఇది .. రణ్‌బీర్‌ తండ్రి పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటించారు ..

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది .. అయితే ఈ సినిమాపై కొందరు ప్రశంసలు కురిపిస్తే మరి కొందరు విమర్శలు కూడా కురిపించారు .. ఈ సినిమాలో ఆడవారిని కించపరిచారు అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక ప్రస్తుతం డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ మూవీతో బిజీగా ఉన్నాడు .. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ కాప్ గా  నటించబోతున్నారని ఇప్పటికే ప్రకటించారు .. అలాగే రణ్‌బీర్ కపూర్ కూడా రామాయణం , లవ్ అండ్ వార్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు .. ఈ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాతే యానిమల్ సీక్వెల్ మొదలు కానుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: