ఓవర్సీస్ లో స్టార్ హీరో అల్లు అర్జున్ కు తిరుగులేదుగా.. ఆ హీరో రికార్డ్ బ్రేక్ చేస్తారా?
అయితే బాహుబలి2, కల్కి మాత్రం టాప్ లో ఉన్న నేపథ్యంలో ఈ సినిమాల రికార్డులు పుష్ప ది రూల్ తో బ్రేక్ అవుతాయా అనే చర్చ జరుగుతోంది. సాధారణంగా ఏ పెద్ద సినిమాకు అయినా ఓవర్సీస్ కలెక్షన్లు కీలకం అనే సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ ఓవర్సీస్ లో సరికొత్త రికార్డులు సాధించడం ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
రాబోయే రోజుల్లో బన్నీ మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అల్లు అర్జున్ కథల ఎంపికలో జాగ్రత్త వహించడంతో పాటు సినిమాలకు సరైన విధంగా ప్రమోషన్లు జరిగేలా చూసుకుంటున్నారు. భిన్నమైన కథలకు ఈ హీరో ఓటేస్తున్నారు.
అల్లు అర్జున్ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నా ఆ రెమ్యునరేషన్ కు బన్నీ న్యాయం చేస్తున్నారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా రాబోయే రోజుల్లో బన్నీ ఖాతాలో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే.