తెలుగులో మొదటిసారి కోటి పారితోషకం అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్లుగా నటిస్తున్న వారికి కోట్లల్లో పారితోషకం ప్రస్తుతం ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక 2010 వ సంవత్సరం కంటే ముందు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కోటి పారితోషకం తీసుకున్న హీరోయిన్ల సంఖ్య అత్యంత తక్కువగా ఉంది. ఆ సమయంలో కోటి పారితోషకం ఒక హీరోయిన్ కి ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మొట్ట మొదటి సారి కోటి పాటితోషకం తీసుకున్న హీరోయిన్ ఎవరు తెలుసా ..? ఆమె మరెవరో కాదు గోవా బ్యూటీ ఇలియానా. ఈ ముద్దు గుమ్మ రామ్ పోతినేని హీరోగా వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.


ఈ మూవీ తో ఈమెకు మంచి విజయం దక్కింది. ఆ తర్వాత ఈమె పలు సినిమాలలో నటించి అనేక విజయాలను అందుకోవడంతో ఈమె చాలా తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇకపోతే ఈమె తెలుగు లో కోటి రూపాయల పారితోషకం తీసుకున్న మొదటి హీరోయిన్ అని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఓ ప్రొడ్యూసర్ చెప్పుకొచ్చాడు.


అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి బెల్లంకొండ సురేష్ కొన్ని సంవత్సరాల క్రితం తరుణ్ హీరోగా ఇలియానా హీరోయిన్గా భలే దొంగలు అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమా సమయం లో తరుణ్ హీరోగా రూపొందే సినిమాలో ఇలియానా హీరోయిన్గా నటించడానికి మొదట ఓకే చెప్పలేదట. ఇక దానితో అప్పటి వరకు తెలుగులో ఏ హీరోయిన్ తీసుకొని కోటి రూపాయల పారితోషకాన్ని ఇలియానా కు ఆఫర్ చేయడంతో ఆమె ఈ సినిమాలో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బెల్లంకొండ సురేష్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: