వ‌ర‌ల్డ్‌వైడ్‌గా పుష్ప‌రాజ్ రూలింగ్ .. దిమ్మ‌తిరిగే రికార్డులు ఇవే.. !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 .. బాక్సాఫీస్ వద్ద రికార్డులతో దూసుకుపోతుంది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజే రూ. 294 కోట్లు వసూళ్లు సాధించి .. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే పుష్ప క్రియేట్ చేసిన పలు రికార్డులు చూద్దాం. రిలీజ్ కి ముందే బుక్ మై షో లో.. గంటలో లక్ష టిక్కెట్లు అమ్ముడైన సినిమాగా రికార్డులకు ఎక్కింది. క‌ల్కి రికార్డు ను బ్రేక్ చేసింది.
రెండో రోజు కూడా గంటలో లక్షకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో నైజాం లో రూ.30 కోట్ల షేర్ సాధించిన తొలి సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఇది నైజాం చ‌రిత్ర లో తిరుగులేని రికార్డు గా నిలిచింది.

బాలీవుడ్ లో ఈ సినిమాకు ఫస్ట్ డే ఏకంగా రూ . 72 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఇండియన్ సినిమా చరిత్రలో హిందీలో .. తెలుగు సినిమాకి ఇన్ని కోట్లు రావడం ఇదే మొదటిసారి. కర్ణాటకలో పుష్ప 2 తొలిరోజు రూ 23.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఒక తెలుగు సినిమాకు తొలిరోజే అక్కడ ఈ స్థాయిలో కలెక్షన్ రావటం రికార్డు. కేరళలో తొలిరోజు రూ 6.35 కోట్లు సాధించింది. తమిళనాడులో పుష్ప 2 మొదటి రోజు రూ 11 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. నార్త్ అమెరికాలో రెండు రోజుల్లోనే 6 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటివరకు 8 మిలియ‌న్ డాలర్లు వసూళ్లు సాధించింది. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్లు సాధించిన హిందీ డబ్ సినిమాగా పుష్ప 2 ఘనత సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: