ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రష్మిక మందన హీరోయిన్గా నటించిన ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 వ తేదీ రాత్రి నుండి ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాకి ప్రీమియర్ షో లతోనే మంచి టాక్ రావడంతో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి.
ఆ తర్వాత కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. దానితో ఈ మూవీ ఇప్పటికే 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. కేవలం మూడు రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఈజీగా 1000 కోట్లకి మించిన కలెక్షన్లను రాబడుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు చాలానే ఉన్న వెయ్యి కోట్ల కలెక్షన్లను అందుకొని కల్కి 2898 AD సినిమా ఈ సినిమాకు మెయిన్ టార్గెట్ గా ఉంది.
కల్కి 2898 AD సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 1061.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. దానితో పుష్ప పార్టీ 2 మూవీ మొదటి టార్గెట్ ఈ సినిమానే కానుంది. పుష్ప పార్ట్ 2 మూవీ 1000 కోట్ల కలెక్షన్లను దాటినట్లయితే కల్కి 2898 AD సినిమా పుష్ప 2 కి మొదటి టార్గెట్ కానుంది. మరి ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను పుష్ప పార్ట్ 2 మూవీ దాటుతుందో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.