ఆ ఒక్క మాటతో.. అల్లు, మెగా వివాదానికి బన్నీ ఫుల్ స్టాప్ పెట్టేసాడా?

praveen
పుష్ప 2: ది రూల్ సినిమా భారీ విజయం సాధించిన సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో హీరో అల్లు అర్జున్ ఈ సినిమా ఇంతలా విజయం సాధించడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి పెద్ద కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టేసారు. అల్లు, మెగా కుటుంబ సభ్యుల మధ్య ఏదో చెడిందని చాలా రోజులుగా చూస్తున్న సంగతి తెలిసిందే అయితే బన్నీ ఒక్క మాటతో నిన్నటితో ఆ పుకార్లకు చెక్ పెట్టారు.
"సినిమా టిక్కెట్ల ధరలు పెంచడానికి ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయడానికి కీలక కారణం పవన్ కళ్యాణ్ గారే" అని అల్లు అర్జున్ అన్నారు. ఆయనను "కళ్యాణ్ బాబాయ్" అంటూ పిలుస్తూ, "ఆయన నా హృదయాన్ని నిజంగా తాకారు" అని బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ విజయోత్సవంలో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్‌ను ప్రశంసించారు. "నటులు గుర్తింపు పొందినా, అంతా క్రెడిట్ ఒక్కరే తీసుకోవాలి, అదే దర్శకుడు" అని అన్నారు. సుకుమార్‌ ఇచ్చిన మద్దతును గుర్తు చేసుకుంటూ తన ప్రస్తుత విజయానికి కారణం ఆయనే అని అన్నారు. "నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే దానికి కారణం సుకుమార్ కు నాపై ఉన్న ప్రేమే. ఇంకేం చెప్పను, డార్లింగ్?" అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా తనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, సినిమా మంత్రి కొమటిరెడ్డిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. టిక్కెట్ ధరలు పెంచడానికి అనుమతి ఇచ్చినందుకు వారిని అభినందించారు. ఈ నిర్ణయం సినిమా విజయానికి ఎంతో దోహదపడిందని చెప్పారు.
బన్నీ ఏపీ సీఎం నారా చంద్రబాబుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. చాలా కాలంగా సినీ పరిశ్రమకు మద్దతు ఇస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. "చంద్రబాబు గారు ఎప్పుడూ సినిమాను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఆయన సహాయం చాలా ముఖ్యం" అని అన్నారు. అంతేకాకుండా, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, సినీ పరిశ్రమలకు ఈ ఐకాన్ స్టార్ కృతజ్ఞతలు తెలిపారు. పుష్ప 2 సినిమా విజయానికి అందరి సహకారమే కారణమని, ఇది నిజమైన పాన్ ఇండియా సినిమా అని ఈ పుష్పరాజ్‌ తన ప్రసంగం ముగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: