చీకటిలో రివ్యూ:పెళ్లి తర్వాత శోభిత నటించిన ఫస్ట్ మూవీ ఎలా ఉందంటే..?

Divya
అక్కినేని కోడలు, నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల మెయిన్ పాత్రలో నటించిన చిత్రం చీకటిలో.శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ఈ రోజున అమెజాన్ ప్రైమ్ (జనవరి 23) లో స్ట్రీమింగ్ అవుతోంది.వివాహం తర్వాత శోభిత నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


స్టోరీ:
సంధ్య (శోభిత ధూళిపాళ్ల) ఒక టీవీ ఛానల్ లో ఫేమస్ క్రైమ్ న్యూస్ ప్రెజెంటర్గా పనిచేస్తుంది. తన ఛానల్ టిఆర్పి కోసం వార్తలను మార్చి చదవడం ఇష్టం లేకపోవడంతో  ఛానల్ హెడ్ (రవివర్మ) తో గొడవ పడి మరి జాబ్ మానేస్తుంది. శోభిత ఫ్రెండ్ బాబీ (అదితి మ్యాకెల్) సలహాతో తన బాయ్ ఫ్రెండ్ అమర్ (విశ్వదేవ్ రాచకొండ) సలహాతో చీకటిలో అనే టైటిల్ తో ఒక క్రైమ్ పాడ్ కాస్ట్ ప్రారంభిస్తుంది సంధ్య. ఈ క్రైమ్  పాడ్ కాస్ట్ మొదలవ్వగానే బాబీతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్  కూడా హత్యకు గురవుతారు. పోలీస్ ఆఫీసర్గా రాజీవ్ (చైతన్య కృష్ణ) ఈ కేసును చేదిస్తూ ఉంటారు. దీంతో సంధ్య తన కోణంలో ఈ హత్య గురించి రీసెర్చ్ చేస్తూ ఆ విషయాలన్నీ కూడా పాడు కాస్ట్ లో చెబుతుంది. అలా అవి వైరల్ గా మారడంతో జనాలలో పోలీసులలో ఈ విషయం చర్చకు దారితీస్తుంది. దీంతో ఆ పాడ్ కాస్ట్ తో సంధ్యకి ఒక  అగంతకుడు ఫోన్ చేసి బెదిరిస్తుంటారు. ఆ సమయంలోనే గోదావరి జిల్లాలలో నుంచి ఒక మహిళ ఫోన్ చేసి తనకు ఇలాంటి ఒక సంఘటన 30 ఏళ్ల క్రితం జరిగిందనే విషయాన్ని సంధ్యకు చెబుతుంది. అదేంటో కనుక్కోవడానికి సంధ్య, అమీర్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తుంది. అసలు 30ఏళ్ల క్రితం ఏం జరిగింది? బాబీని  ఎందుకు హత్య చేశారు? ఎవరు చేశారు? సంధ్య పోలీసులతో  కలిసి మర్దరి మిస్టరీ ఎలా చేదించింది? అనే  తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ:

వివాహాం అనంతరం శోభిత నటించిన మొదటి సినిమా ఇదే కావడం గమర్హం. తెలుగులో చాలాకాలం తర్వాత డైరెక్ట్ గా సినిమా చేసింది. చీకటిలో మర్డర్ మిస్టరీలు, విలన్ ఎవరో కనిపెట్టడానికి చేసిన ప్రయత్నాలు, మర్డర్ మిస్టరీని 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు లింకు చేస్తూ రాసుకోవడం బాగానే ఆకట్టుకుంది. ప్రతి సీన్ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందనే విషయంపై ఎక్సైటింగ్ గా అయ్యేలా ఉంటుంది. మర్డర్ మిస్టరీలు చేసింది ఎవరనే విషయం మాత్రం క్లైమాక్స్  పెద్ద ట్విస్ట్ ఎవరు ఊహించలేరు. విలన్ ఎవరనే విషయం రివిల్ అయ్యేంతవరకు మనం గెస్ చేయలేం. విలన్ వీటన్నిటిని ఎందుకు చేశారనే విషయాన్ని కూడా బాగా చూపించారు డైరెక్టర్. అలాగే కొన్ని విషయాలలో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు పడే ఇబ్బందులు బాధలను కూడా చూపించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న తీరును కూడా చూపించారు.

నటీనటుల నటన:
శోభిత ఇందులో తనకు ధైర్యంగా నచ్చే పని చేసే అమ్మాయి పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. తన పాత్రలో ఒదిగిపోయినటించి తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తూ ,డైలాగులతో ఆకట్టుకుంది. నటుడు విశ్వదేవ్ రాచకొండ  అద్భుతంగా నటించారు. చైతన్య కృష్ణ పోలీస్ ఆఫీసర్గా ఆకట్టుకున్నారు. అలాగే ఝాన్సీ, శ్రీలక్ష్మి, ఆమని, సురేష్, రవి వర్మ ఇలా అందరూ కూడా తమ పాత్రలను బాగా ఆకట్టుకునేలా చేశారు.


మొత్తానికి శోభిత కాస్త గ్యాప్ తీసుకొని చేసినప్పటికీ చీకటిలో సినిమాతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంది శోభిత.


రేటింగ్:
2.5/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: