అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిని ప్రేమించకపోతే .. ఆ స్టార్ హీరోయిన్ నే పెళ్లి చేసుకునే వాడ..!?
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాడు .. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక పుష్ప2 మొదటి రోజే 200 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి కేవలం రెండు రోజుల్లోనే 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే బాలీవుడ్ లోనే తొలిరోజు 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అదిరిపోయే రికార్డులు సెట్ చేసి అక్కడ హీరోలకు సవాల్ విసిరాడు అల్లు అర్జున్. ఇలా పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇదే సమయంలో అల్లు అర్జున్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ , స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు .. వీరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్.
అప్పట్లో వీరి పెళ్లి టాలీవుడ్ లోనే ఓ సెన్సేషన్ గా మారింది. అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిని ప్రేమించకుండా ఉంటే .. ఆయన తన బంధువుల్లో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడని ఓ వార్త వైరల్ గా మారింది. మొదటి నుంచి అల్లు అర్జున్ కి వారి బంధువులలో ఉన్న ఓ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని .. వాళ్ల అమ్మగారు అనుకునేవారట. బన్నీ తన లైఫ్ లో సెటిల్ అయ్యాక .. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ కి చెప్పి గ్రాండ్గా పెళ్లి చేయాలని అనుకునేవారట .. అయితే అల్లు అర్జున్ ఈలోపే తొందరపడి స్నేహారెడ్డిని చూడటం ఆమెను ప్రేమించడం .. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాల్సి వచ్చింది .. ఇక స్నేహారెడ్డి రాకపోతే ఖచ్చితంగా బన్నీ తన భార్య స్థానంలో వాళ్ళ అమ్మగారు అనుకున్న అమ్మాయి ఉండేదట . ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .