టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ప్రభాస్ , అల్లు అర్జున్ కూడా ఉంటారు. ఇకపోతే ప్రభాస్ కొంత కాలం క్రితం కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి భారీ రికార్డును బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ , మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ , హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇక సందీప్ రెడ్డి గంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు.
ఇకపోతే అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే అద్భుతమైన క్రేజ్ ఉన్న ఈ హీరోల సినిమాల్లో అవకాశం వస్తే ఓ బ్యూటీ మాత్రం వాటిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మరి ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు శ్రద్ధా కపూర్. ప్రభాస్ , అల్లు అర్జున్ నటించబోయే సినిమాల్లో ఈ ముద్దు గుమ్మకు ఆఫర్ వస్తే ఈమె మాత్రం ఆ సినిమాలలో కొన్ని కారణాల వల్ల నటించడానికి నో చెప్పిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా శ్రద్ధ కపూర్ "స్త్రీ 2" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈమె క్రేజ్ చాలా వరకు పెరిగిపోయింది.