పుష్ప-2 మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్.. దేనికోసమంటే?

praveen
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. ప్రీమియర్‌ల తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చాలా చర్చ జరుగుతోంది. సినిమాకు చాలా మంచి రివ్యూలు వస్తున్నప్పటికీ, కొన్ని వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. ఈ సినిమాలోని ఒక డైలాగ్‌ వల్ల చిరంజీవి అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. బన్నీ సినిమాలో స్మగ్లింగ్ గ్యాంగ్ గురించి మాట్లాడుతూ ‘బాస్’ అని ఒక డైలాగ్ చెప్తాడు. మామూలుగా నిజ జీవితంలో చిరంజీవిని ‘బాస్’ అని పిలుస్తారు కాబట్టి, ఆ డైలాగ్ చిరంజీవిని ఉద్దేశించి చెప్పారని కొందరు అనుకుంటున్నారు.
"ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్... ఆడికి, ఆడి కొడుకుకి, ఆడి తమ్ముడికి... నేనే రా బాస్" అన్న డైలాగ్ ఈ సమస్యకు కారణమైంది. అయితే, ఈ వెర్షన్ తప్పు, ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ సినిమాలోని అసలు డైలాగ్
 “ఎవడ్రా బాస్సూ? ఎవడికి రా బాస్సా? మాములుగా చూస్తే నీకు బాస్ కనిపిస్తాడు.  ఇలా తల కిందులు గా చూస్తే నీ బాస్ లకి బాస్ కనిపిస్తాడు.  నేనే రా నీ బాస్.  పుష్ప నీ బాస్.” ఇది.
అయినా ‘పుష్ప 2’ సినిమాలోని కొన్ని డైలాగ్‌లను తప్పుగా అర్థం చేసుకుని, మెగా ఫ్యామిలీని ఉద్దేశించి వాటిని చెప్పారని కొందరు ప్రచారం చేస్తున్నారు. చివరికి సినిమా యూనిట్ ఈ విషయాన్ని ఖండించింది. ఈ డైలాగ్‌లు సినిమా కథకు సంబంధించినవే తప్ప, ఎవరినీ ఉద్దేశించి చెప్పినవి కాదని స్పష్టం చేసింది. సినిమాలోని డైలాగ్‌లను తమకు నచ్చిన విధంగా మార్చి, అపోహలు రేకెత్తిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మైత్రి మూవీ మేకర్స్‌ హెచ్చరించింది.
అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం వల్ల ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా మారే అవకాశం ఉంది. రష్మిక కూడా చాలా బాగా నటించింది ఇందులోని గంగమ్మ జాతర సీక్వెన్స్ సూపర్ హిట్ అయింది పాటలు కూడా చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ ఫస్ట్ రోజే రూ.175 కోట్లు కలెక్ట్ చేసింది. రెండో రోజు 400 కోట్ల దాకా డబ్బులు వసూలు చేసింది ఇంకా ఎక్కువ మనీ వచ్చే అవకాశం ఉంది. ఇది చరిత్ర సృష్టించే అవకాశం ఉందని చాలా మంది ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అయితే, కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తుండటం బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: