ఆ వ్యక్తి కారణంగానే మెగా ఫ్యామిలీలో గొడవలు .. పుల్లలు పెడుతూ అల్లు అర్జున్ అందుకే దూరం..?
మెగా ఫ్యామిలీ లో అల్లు ఫ్యామిలీ వీరని తనకు మెగా బ్రాండ్ వద్దన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటుందని ఫ్యాన్స్ ఎప్పటినుంచో అంటూ వస్తున్నారు .. గతంలో కూడా చెప్పను బ్రదర్ అనే ఇన్సిడెంట్ తో మొదలుపెట్టి నిన్న మొన్న ఎన్నికల్లో వైసిపి అభ్యర్థికి సపోర్ట్ వరకు బన్నీ చేసిన చర్యలు వల్ల మెగా ఫ్యామిలీకి ఆగ్రహం వచ్చాయని కూడా అంటున్నారు. ఇప్పటివరకు ప్రతిదీ చూసి చూడనట్లుగా వదిలి పెట్టినప్పటికీ వైసీపీ అభ్యర్థికి ప్రచారాన్ని మాత్రం మెగా పెద్దలు సీరియస్గా తీసుకున్నట్లుగా ఫిలిం నగర్ లో చర్చ జరుగుతుంది . అలాగే అల్లు అర్జున్ పై నాగబాబు ట్వీట్ బన్నీ దంపతులను సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం ఈ పరిణామాలు చూస్తుంటే మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతుందని అంత అనుకున్నారు. అయితే ఈరోజుకి ఈ గొడవకి పుల్ స్టాప్ పడకపోగా .. రోజురోజుకి మరింత తీవ్రమైపోతుంది. అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ లో కనిపించడం లేదు ఆఖరికి నిన్న పుష్ప2 టిం మొత్తం చిరంజీవిని కలవగా హీరో అయి ఉండి బన్నీ అసలు ఆయన దగ్గరికి వెళ్ళటానికి మొహం చాటేసారు. ఇలాంటి పరిణామాలు చూస్తుంటే అభిమానులకు తప్పుడు సంకేతాలు వస్తున్నాయని కూడా కొందరు ఉంటున్నారు. అయితే ఈ గొడవలు అన్నిటికీ కారణం మెగా బ్రదర్ నాగబాబు అని కామెంట్స్ కూడా మరి కొందరు అంటున్నారు. మెగా బ్రదర్స్ ని ఎవరైనా పల్లెత్తు మాట అన్నా వాళ్ళని చెడుగుడు ఆడుకుంటారు నాగబాబు..
ఇక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన ఘటన పోలింగ్ జరిగే వరకు ఓపిక పట్టిన ఆయన వెంటనే మనోడు పరాయివాడు అంటూ వదిన ట్వీట్ ఎంతో కలకాలం రేపింది. ఇక దానికి ఒంటరిగా అల్లు అర్జున్ అభిమానులు రెచ్చిపోయి నాగబాబుని ఏకంగా ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేయించారు. తర్వాత మెగా కుటుంబంలో ఉన్న పెద్దలు రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం కొన్నాళ్ళు సద్దుమణిగింది. మెగా ఫ్యామిలీలో చీలికలపై ఓ ఛానెల్‌లో ప్రసారమైన కార్యక్రమంలో ఓ నిపుణురాలు కూడా మెగా ఫ్యామిలీలో గొడవలకి నాగబాబే కారణమని చెప్పారు. అన్నదమ్ములిద్దరూ ఉన్నత శిఖరాలకు చేరుకోగా.. ఆయన పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని ఆమె అన్నారు. చిరంజీవి అతనిని కంట్రోల్ చేయకుంటే గొడవలు ఇలాగే కంటిన్యూ అవుతాయని ఆ నిపుణురాలు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని విషయాలను పట్టుకోవాలి, కొన్ని విషయాలను వదిలేయాలని అలా కాకుండా సాగదీస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.