పుష్ప2లో సుకుమార్ చేసిన బిగ్ మిస్టేక్ ఇదే.. మీరు గమనించారా..!
చాలామంది ఇండస్ట్రీకి నెంబర్ వన్ హీరో పుష్పరాజ్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . రష్మిక పర్ఫామెన్స్ గురించి అయితే మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ అనే రేంజ్ లోనే కామెంట్స్ పెడుతున్నారు . అయితే సుకుమార్ ఈ సినిమా ని ఓ రేంజ్ లో తెరకెక్కించారు అని ..సుకుమార్ లేకపోయినా అల్లు అర్జున్ నటించకపోయినా.. రష్మిక మందన్నా సపోర్ట్ చేయకపోయినా పుష్ప2 సినిమా అట్టర్ ప్లాప్ అయి ఉండేది అని కామెంట్స్ పెడుతున్నారు . ఇదే మూమెంట్ లో సుకుమార్ ఈ సినిమాలో బిగ్ మిస్టేక్ కూడా చేశారు అంటున్నారు . నిజానికి సినిమాకి సంబంధించిన టీజర్ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. దాదాపు ఏడాదికి ముందే పుష్ప 2 చిన్న గ్లింప్స్ టీజర్ ను రిలీజ్ చేశారు .
ఆ టీజర్ లో బన్నీ ఏదో మిస్ అయినట్టు ..అడవుల్లో కనిపించినట్లు ..ఒక భారీ డైలాగును కూడా రిలీజ్ చేశారు . పుష్ప గోటి వేలు ని హైలెట్ చేస్తూ మరింతగా గ్లింప్స్ పై ఫోకస్ చేశారు . అంతేకాదు "అడవిలోని జంతువులు ఒక అడుగు వెనక్కి వేస్తే పులి వచ్చింది అని అర్థం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేస్తే పుష్ప రాజుగాడు వచ్చాడు అని అర్థం" అనేలా భారీ డైలాగ్స్ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు అదే విషయం హైలెట్ గా మారింది . అసలు రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప2 సినిమాలో అలాంటి సీన్సే లేవు.. అలాంటి డైలాగ్స్ లేవు .. మరి సుకుమార్ ఎందుకు ఈ సీన్స్ ని క్రాప్ చేశాడు అన్నది అర్థం కావడం లేదు . సినిమానే మలుపు తిప్పే రేంజ్ లో ఉన్న అలాంటి సీన్స్ సుకుమార్ వదులుకున్నాడు అంటే ఏదో రీజనే ఉంటుంది . కానీ అలాంటి ఒక కంటెంట్ ఉన్న సీన్స్ సినిమా నుంచి తొలగించడం సుకుమార్ చేసిన బిగ్ మిస్టేక్ అంటున్నారు..!