శకావత్ సార్ పై షాకింగ్ కామెంట్ చేసిన హాట్ బ్యూటీ.. దెబ్బకు మైండ్ బ్లాక్..!
అయితే ఇప్పుడు పుష్ప సినిమా తొలిరోజు భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇండియా వైడ్ గా ఈ సినిమా ఏకంగా 170 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలై ప్రేక్షకులని మెప్పించింది. అలాగే అన్ని భాషల్లోనూ ఈ సినిమాకి భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ తో పాటు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించాడు .. ఇక మలయాళ చిత్ర పరిశ్రమ లో స్టార్ హీరోగా రాణిస్తున్న ఫహాద్ ఫాజిల్ ఈ మూవీ లో విలన్ గా అదరగొట్టాడు .
భన్వర్ సింగ్ షెకావత్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన నటనతో అదరగొట్టాడు. ఇక పుష్ప మొదటి భాగంలో షెకావత్ పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫహద్ ఫాజిల్ పుష్ప2లో తన నటనతో అదరగొట్టాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఇక తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఫహద్ గురించి తాజాగా హాట్ బ్యూటీ రుహాణి శర్మ సెన్సేషనల్ కామెంట్ చేసింది. పుష్ప సినిమాలో నేను ఫాఫా ఎంట్రీ కోసం ఎంతో ఎదురు చూశాను .. అలాగే సినిమా చూస్తున్నప్పుడు నా పక్కనే ఉన్న నా తమ్ముని కూడా అడిగాను ఫాఫా వచ్చాడా లేదా అని ఆయన ఎంట్రీ ఇవ్వగానే నేను అతన్ని అసలు గుర్తుపట్టలేకపోయాను .. అంతలా ఆయన పాత్రలో ఒదిగిపోయాడు అంటూ ప్రశంసలు కురిపించింది రుహాణి శర్మ .. ఆయన కనిపించిన ప్రతి సీన్ కి నాకు గూస్ బంప్స్ వచ్చాయి .. మీరంటే నాకు చాలా ఇష్టం , మీతో వర్క్ చెయ్యాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. మిమ్మల్ని ఎవరూ మ్యాచ్ చెయ్యలేరు. మీ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ .