స‌మంత కంటే శోభిత‌కే ఎక్కువ క్రేజ్ ఉందా.. ఇది 100 % నిజం.. !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
ఎప్పుడైతే నాగచైతన్యతో డేటింగ్ అంటూ పుకార్లు మొదలయ్యాయో అప్పటినుంచి టాలీవుడ్ లో హాట్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పేరు ఎక్కువగా వినిపించడం మొదలుపెట్టింది. ఇక ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత శోభిత గురించి ఇంటర్నెట్లో సెర్చింగ్ చేయడం మరింతగా ఎక్కువైంది. తాజాగా చైతు శోభితా పెళ్లి చేసుకోవడంతో మరోసారి ఆమె పేరు మీడియాలో నూ ...సోషల్ మీడియాలో ను మార్మోగిపోతుంది. ఇలా ఎన్నో సందర్భాలలో శోభిత ట్రెండింగ్లోకి రావడంతో ఆమె పేరు లిస్టులో మరింత పైకి చేరింది. ఈ క్రమంలోనే ఆమె చైతు మొదటి భార్య . . ఒకప్పటి స్టార్ హీరోయిన్ సమంత ను సైతం వెనక్కు నెట్టేసింది. 2024 సంవత్సరాలకు గా ను మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాను ఐఎండిబి విడుదల చేసింది. ఇందులో చైతు మాజీ భార్య సమంతకు ఎనిమిదవ స్థానం దక్కగా .. చైతు భార్య శోభితకు ఏకంగా ఐదో స్థానం దక్కింది. 2023లో ఇదే జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్న శోభిత ఇప్పుడు ఏకంగా 5వ స్థానానికి ఎగ‌బాకింది.

సమంతకు 2023 జాబితాలో అసలు చోటు దక్కలేదు. అయితే ఈ ఏడాది సిటాడెల్ హనీ బన్నీ కారణంగా ఆమె మోస్ట్ పాపులర్ స్టార్ జాబితాలోకి ముందుకు దూసుకు వచ్చింది. ఇక గత యేడాది లిస్టులో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న షారుక్ ఖాన్ ఈ యేడాది ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయారు. బాలీవుడ్ తాజా సెన్సేషన్ యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రి టాప్‌ పొజిషన్ దక్కించుకుంది. టాప్ టెన్ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితా ఇలా ఉంది.

1 ) తృప్తిదిమ్రి
2 ) దీపికా పదుకొనే
3 ) ఇషాన్ కట్టర్
4 ) షారుక్ ఖాన్
5 )శోభిత
6 ) శర్వారి
7 ) ఐశ్వర్యారాయ్
8 ) సమంత
9 ) అలియాభట్
10 )  టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: